జగన్ హితుల మాట వినడు

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ హితుల మాటను వినే స్థితిలో లేరు. అలా వినకపోవడం ద్వారా ఆయన క్రమంగా దూరమవుతున్నారు. రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఎంతో అనుభవం ఉన్నవారి మాట ఆయన చెవికి ఎక్కడం లేదు. వెనకా ముందులు చూడకుండా ఉన్న ఫలంగా అధికారం దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న ఆయనకు ఎవరి మాటా రుచించడం లేదని అంటున్నారు. కొండా సురేఖ, అంబటి రాంబాబు వంటి అనుచురులే తప్ప ఆయనకు సలహాదారులు లేకుండా పోయారు. వైయస్ కుటుంబాన్ని వెన్నంటి ఉండి, ఒక కవచంలా పనిచేస్తూ వస్తున్న కెవిపి రామచందర్ రావు మాటను కూడా జగన్ లెక్క చేయని స్థితికి వెళ్లిపోయారు. వైయస్ సుదీర్ఘ కాలం అసమ్మతి రాజకీయాలు నడిపి చివరికి అధికారం దక్కే వరకు రామచందర్ రావు వైయస్ వెన్నంటి ఉన్నారు. ఆయనకు కాంగ్రెసు రాజకీయాలు క్షుణ్నంగా తెలుసు. కాంగ్రెసులోని ఏ నాయకుడు ఏమిటో కూడా తెలుసు. అధిష్టానం అంటే ఏమిటో తెలుసు. పావులు ఎలా కదుపుతారో తెలుసు. అటువంటి రామచందర్ రావు మాట కూడా జగన్ వినడం లేదు.

నిజానికి, రాష్ట్ర మంత్రుల్లో ఎక్కువ మంది జగన్ హితాన్ని కోరేవారే. కానీ జగన్ రాజకీయాలు ముందుకు సాగవని గుర్తించి క్రమంగా వెనక్కి తగ్గారు. కొంత మంది సీనియర్ మంత్రులు, వైయస్ సన్నిహితులు జగన్ కు సహన మంత్రం బోధించారు. కానీ ఆయన వినలేదు. మెజారిటీ కాంగ్రెసు శాసనసభ్యులు కూడా జగన్ కు అధికారం దక్కాలని కోరుతున్నవారే. కానీ వారంతా ఒక్కరొక్కరే వెనక్కి వెళ్లి జగన్ పక్కన పట్టుమని ఇరవై మంది కూడా మిగలని పరిస్థితి. ఆ ఇరవై మందిలో చాలా మంది అధిష్టానంపై తిరుగుబాటు చేస్తే తాము వెనక్కి తగ్గుతామని చెబుతున్నారు. కాకినాడలో అదే విషయాన్ని వారు జగన్ కు చెప్పారు. అందుకే జగన్ తన ప్రసంగంలో చాలా సహనం వహించి తాను ఎప్పుడు సహనం కోల్పోతానో తెలియదని మాత్రం అన్నారు.

కుటుంబానికి ఇప్పుడు ఆయనే పెద్ద కాబట్టి కుటుంబ సభ్యులకు ఆయన చెప్పడమే తప్ప ఆయనకు చెప్పే వారు లేరు. కుటుంబ సభ్యులంతా ఆయన మాట వినాల్సిందే. ఈ పరిస్థితి రావడానికి కారణం - జగన్ తొందరపాటు, అధికారంపై ఆశ తప్ప మరేమీ కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+