వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ 'సగం'వాడే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసులోని అందరికీ నాయకుడు కాలేకపోయారు. కాంగ్రెసులో వర్గపోరు మామూలే అయినప్పటికీ జగన్ ఎక్కువ మంది ఆదరణను చూరగొనలేక పోతున్నారు.నిజానికి, వైయస్ రాజశేఖర రెడ్డి కూడా అందరి ఆదరణను, మద్దతును పొందిన నాయకుడు కాడు. కాంగ్రెసు పార్టీలో ఒక వర్గం ఆయనను బలపరుస్తూ వచ్చింది. అధికారం పొందిన తర్వాత తన వర్గాన్ని ప్రోత్సహించి, బలోపేతం చేశారు. దాని వల్ల ఇప్పుడు జగన్ కు ఒక వర్గం నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. జగన్ కు కాంగ్రెసు పార్టీలో ఉన్న ప్రత్యర్థుల సంఖ్య గానీ వారి బలం గానీ తక్కువేమీ కాదు. దాదాపుగా సీనియర్ నేతలంతా ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారు. జగన్ సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రి కావాలని తాపత్రయ పడడం, అందుకు తన వర్గాన్ని రెచ్చగొడుతూ ఉండడం వారికి నచ్చడం లేదు. ఆయన ఏ మాత్రం ఓపిక చూపకపోవడం వల్ల కూడా శత్రువుల సంఖ్య పెరిగింది. జగన్ కు అంత తొందరేమిటనే ఆగ్రహం చాలా మందిలో చోటు చేసుకుంది.

వైయస్ రాజశేఖర రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన వర్గానికి చెందిన కొందరు సీనియర్లను కూడా దూరం పెట్టారు. పూర్తిగా తనకు భజన చేసే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. అంతకు ముందు ఏమీ కానివారు కూడా చెలరేగిపోయారు. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన డిఎల్ రవీంద్ర రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డికి ఒకప్పుడు అత్యంత సన్నిహితులు. అయితే వారిద్దరికి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వైయస్ తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఆ జిల్లా నుంచి జూనియర్లకు అవకాశమిచ్చి వారి ప్రాధాన్యాన్ని తగ్గించారు. ఇటువంటి వారు ఇంకా ఉన్నారు. దీంతో వైయస్ పై అటువంటి వారికి కూడా వ్యతిరేకత ఏర్పడుతూ వచ్చింది. అయితే ఆయన జీవించి ఉన్నంత వరకు ఎవరూ నోరు మెదపలేదు. పార్టీ అధిష్టానం అండదండలు ఉండడం, వైయస్ కు ఎదురు లేకపోవడం అందుకు కారణం. అయితే, వైయస్ చెప్పుల్లో కాళ్లు పెట్టాలని ప్రయత్నిస్తున్న జగన్ కు పెద్ద యెత్తున వ్యతిరేకత ఎదురవుతూ వస్తోంది.

తొలుత ముఖ్యమత్రిగా రోశయ్య అసమర్థుడని చిత్రీకరించడానికి ప్రయత్నించిన జగన్ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తన తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇస్తోందంటూ తన ప్రసంగాల ద్వారా, సాక్షి పత్రిక ద్వారా జగన్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో కాంగ్రెసులోని సీనియర్లంతా మరోసారి ఏకమయ్యారు. ఏకు మేకు కాక ముందే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కె. రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఢిల్లీలో మంత్రాంగ నడుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X