నువ్వా- నేనా: ఢిల్లీ చేరిన కర్ణాటక పంచాయితీ: మంత్రులు సైతం

కర్ణాటకలో నాయకత్వ మార్పు వార్తలు మళ్లీ తెరమీదికి వచ్చాయి. ఈ ఊహాగానాల తెరపడట్లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు ఈ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీని కలుసుకోనున్నారు. ఈ సాయంత్రం ఈ భేటీ ఏర్పాటు కానుంది.

అంతకుముందు సిద్ధరామయ్య.. ఇందిరా భవనంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్ దీప్ సూర్జేవాలాతో భేటీ అయ్యారు. అదే రోజు కర్ణాటక భవన్ లో మంత్రులు ఎంబీ పాటిల్, జీ పరమేశ్వర, భైరాతి సురేష్, సతీష్ జార్కిహోళి, కేజే జార్జ్, హెచ్ సీ మహదేవప్ప, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్, న్యాయ సలహాదారు ఎఎస్ పొన్నన్నతో సిద్ధరామయ్య కర్ణాటక భవన్ లో అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు.

CM Siddaramaiah and Deputy CM DK Shivakumar Meet High Command Amid Leadership Speculation

కర్ణాటక భవన్‌కు ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు. మరికొందరు రానున్నారని సమాచారం. సఫ్దర్‌జంగ్ నివాసం నుండి బయలుదేరేటప్పుడు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. నాయకత్వ మార్పిడికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలను దాటవేశారు. దీనికి సంబంధించిన ఏ ప్రశ్నకూ ఆయన సమాధానం ఇవ్వలేదు. ఒక దశలో వాటిని కొట్టిపారేశారు కూడా. కర్ణాటక భవన్‌కు వెళ్తున్నానని, సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనాల్సి ఉందని అన్నారు.

అటు సిద్ధరామయ్య కూడా అధికార మార్పునకు సంబంధించిన ప్రశ్నలకు బదలివ్వలేదు. అధిష్టానం తనను ఢిల్లీకి పిలిచిందని, అందుకే వచ్చానని ఒక్క ముక్కలో తేల్చి చెప్పారు. ఎందుకు అనేది తనకు తెలియదని స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్ నుంచి తనకు ఆహ్వానం అందిందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశ అజెండాపై మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. దాని సారాంశం ఏమిటనేది రాహుల్ గాంధీకి మాత్రమే తెలుసునని స్పష్టం చేశారు. మిగతా వివరాలు భేటీ తర్వాత వెల్లడవుతాయని చెప్పారు.

రాబోయే రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలు లేదా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి కావచ్చని ఎంబీ పాటిల్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీ పుట్టరంగశెట్టి మాట్లాడుతూ.. నాయకత్వ మార్పు నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని వ్యాఖ్యానించారు. తాను సిద్ధరామయ్యకు విధేయుడినని, ఆయన శిష్యుడినని చెప్పుకొన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు మార్పు ఉండకపోవచ్చని, సిద్ధరామయ్యే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+