వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు కాంగ్రెసుల పోరు, అశల పల్లకీలో చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోరు తనకు ఎనలేని ప్రయోజనం చేకూరుస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశపడుతున్నారు. అంతేకాకుండా, అవినీతిపై వ్యతిరేక పోరులో ఆ రెండు పార్టీలు మాట్లాడలేని స్థితిలో తనకు లభించిన అవకాశం కూడా పార్టీకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. అవినీతిపై పోరును నెత్తిన వేసుకుని ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. విద్యార్థులతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు రాజీనామా చేసిన నియోజకవర్గాల్లో పాగా వేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. రాజీనామా చేసిన 26 మంది శాసనసభ్యుల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాగా, మిగతా 24 మంది (శోభానాగిరెడ్డి సహా) కాంగ్రెసు పార్టీకి చెందినవారే.

రాజీనామాల ఆమోదం వల్ల 26 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే తమ పార్టీ సత్తా చాటగలదని ఆయన అనుకుంటున్నారు. రెండుకు మించి అదనంగా ఎన్ని సీట్లు వచ్చినా పార్టీ నైతిక బలం చేకూరుతుంది. అయితే, సగానికి పైగా సీట్లలో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాన్ని చంద్రబాబు రూపొదించుకున్నట్లు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఈ 26 స్థానాలలో చాలా చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు 2,000 నుంచి 5,000 వోట్ల మధ్య మెజారిటీతోనే గట్టెక్కారు. కొన్ని చోట్ల 1,000 నుంచి 1,500 వోట్ల తేడాతో మాత్రమే విజయాలు సాధించారు. ఈ రెండు మెజారిటీలతో కాంగ్రెస్‌ సాధించిన స్థానాలు దాదాపు 12కు పైగా ఉన్నాయి.

ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య ఆ వోట్లు చీలే అవకాశాలున్నాయని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని కాస్తా శ్రమిస్తే చాలా చోట్ల విజయం సాధించవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఆయన ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులతో ఆయన సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సుడిగాలి పర్యటన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తంగా, ప్రస్తుత అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

English summary
It is learnt that TDP president N Chandrababu Naidu is planning to win half of the seats, if bypolls comes to the 26 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X