• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముందు జగన్, ఆ తర్వాతే... సిఎం వ్యూహం

By Srinivas
|

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జగన్‌తో వెళుతున్న శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ముఖ్య నేతల జాబితా సేకరించమని సూచించారు. జగన్ వర్గంపై చర్యలకు సిఎం శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించినప్పటికీ ఇక ముందు ఉపేక్షిస్తే మొదటికే మోసం వచ్చేలా ఉందని భావించిన సిఎం చర్యలకు వెనుకాడే ప్రసక్తి లేదన్న సంకేతాలు మరింత ఘాటుగా ఇచ్చారు. ఇప్పటిదాకా ఇప్పుడు జరగని కసరత్తును ప్రారంభించారు. అందుకే జిల్లాల వారీగా ఆ జాబితా రూపొందించి తనకు అందజేయాలని మంత్రివర్గ సమావేశంలో సీఎం మంత్రులను ఆదేశించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ, జగన్‌ పల్లవి కొనసాగిస్తున్న నాయకులు అన్ని స్థాయుల్లోనూ పార్టీకి శిరోభారంగా మారారు. ఉదయం కాంగ్రెస్‌ ఆఫీసు, సాయంత్రం జగన్‌ పార్టీ ఆఫీసు లో తిరుగుతుండటంతో ఎవరు అసలో, ఎవరు నకిలీనో అర్థం కాని అయోమయ పరిస్థితి పార్టీకి నష్టం వాటిల్లచేస్తోందని కిరణ్‌ గ్రహించారు. కొందరు ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు పార్టీలో ఉంటూనే జగన్‌కు అనుకూల ప్రకటనలు ఇస్తున్నా వారిపై పార్టీపరంగా చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌‌తో తిరిగే నాయకుల జాబితాను నియోజకవర్గాల వారీగా తనకు అందచేయాలని సిఎం మంత్రివర్గ సమావేశంలో కూడా ఆదేశించారు. అదే విషయాన్ని పిసిసి అధ్యక్షుడికీ స్పష్టం చేసి, జిల్లాల వారీగా జాబితాను త్వరగా రూపొందించాలని ఆదేశించడం బట్టి కిరణ్‌ వ్యూహమేమిటన్నది స్పష్టమవుతోంది. వారిని తొలగించి, అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారుచేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నది కిరణ్‌ వ్యూహంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. జగన్‌ వర్గీయులను పూర్తి స్థాయిలో అణచి వేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని ఆరునెలల్లోగా చక్కదిద్దిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్న వ్యూహంతో కిరణ్‌ అడుగులు వేస్తున్నారు.

పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలు వారంరోజుల పాటు వాయిదా వేయడం వెనుక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి కసరత్తు చేయకుండా, జగన్‌ వ్యవహారం తేల్చకుండా ఎన్నికలకు వెళితే ఓట్లు చీలిపోయి తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందని కిరణ్‌ అంచనా వేస్తున్నట్లుగా ఉంది. అందుకే ముందుగా, జగన్‌ వర్గీయులుగా వ్యవహరిస్తోన్న ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని భావిస్తున్నారు. ఆ మేరకు స్పీకర్‌తో మాట్లాడాలని కూడా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక నియోజక వర్గ స్థాయిలో కూడా మాజీ ఎమ్మెల్యేలు, పీసీసీ, డీసీసీ స్థాయి నేతలపైనా వేటు వేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. కింది స్థాయిలో నెలకొన్న ఈ గందరగోళాన్ని అరికట్టపోతే కడపలో మాదిరిగా అంతా కలసి కుమ్మక్కయి పార్టీని పుట్టి ముంచుతారన్న ముందుచూపుతోనే కిరణ్‌ ఇలాంటి వ్యూహం అనుసరించినట్లు కనిపిస్తోంది.

English summary
CM Kiran Kumar Reddy is chalked out a strategy to obstruct YSR congress party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X