తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటన వెనుక

Telangana Map
తెలంగాణ ప్రాంత మంత్రుల న్యూఢిల్లీ పర్యటనపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. సమ్మె కాలంలో విధులకు హాజరు కానీ మంత్రులు సమ్మె ముగియగానే విధులకు హాజరయ్యారు. సమ్మె సమయంలో మంత్రులు విధులకు హాజరు కాకపోవడమే కాకుండా తెలంగాణకు అనుకూలంగా ఉద్యమించారు కూడా. అయితే సమ్మె విరమణ తర్వాత నోరు మెదపడం లేదనే వాదనలు తమపై రాకుండా ఉండేందుకే వారు న్యూఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 20 లేదా 21వ తేదీన తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత కె కేశవ రావు, బస్వరాజు సారయ్య పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డితో ఆదివారం భేటీ అయ్యారు. తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావడానికి తాము పర్యటిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. అయితే వారి పర్యటన వెనుక మరో వ్యూహం దాగి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల సకల జనుల సమ్మె సమయంలో బాన్సువాడ ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణ సెంటిమెంట్ ఎంత బలంగా ఉన్నప్పటికీ టిఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుకున్నంత మెజార్టీతో గెలుపొందలేదు. అంతేకాదు కాంగ్రెసు అభ్యర్థికి దాదాపు 34 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. కాంగ్రెసు అభ్యర్థికి అన్ని ఓట్లు పడటానికి కారణం సమ్మె సమయంలో టి-ఎంపీలు టిఆర్ఎస్‌కు ధీటుగా తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొనడమేననేది తెలంగాణ కాంగ్రెసు నేతల వాదన. డిపాజిట్ దక్కడమే కష్టమని టిడిపి, టిఆర్ఎస్‌తో పాటు కాంగ్రెసు కూడా భావించింది. అందుకే టిడిపి అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. కానీ ఫలితాలు భిన్నంగా రావడం అందరితో పాటు కాంగ్రెసునూ అబ్బురపరిచింది. వారిలో ఉత్సాహం నింపింది. సమ్మెలో తాము పాల్గొనటం వల్లనే ఆ ఓట్లు వచ్చాయని కాంగ్రెసు ఎంపీలు చెప్పారు.

ఇప్పుడు మంత్రులు కూడా ఉప ఎన్నికల కోసం అదే పంథాలో వెళుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే తాము తెలంగాణ కోసం అధిష్టానం వద్ద తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామనే భావన ప్రజల్లో కలిగించి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీ పర్యటన వేసినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీలు ఎలాగూ లోక్‌సభలో నిరసన తెలిపిన విషయం ప్రజల్లోకి చొచ్చుకు పోయింది. ఇక మంత్రులుగా ఉన్న తాము కూడా అదే బాటలో నడిచి తెలంగాణలో కాంగ్రెసు వీక్ కాకుండా చూసుకోవాలనే భావనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+