వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి, దాసరి కలుస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Dasari Narayana Rao
కాంగ్రెసు పార్టీలో కుల సమీకరణలు ఊపందుకున్న నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు కలుస్తారా అనే విషయం ఆసక్తిగా మారింది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసుకు దూరమైన నేపథ్యంలో దాసరి నారాయణ రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. చిరంజీవి ప్రోద్బలంతోనే దాసరి నారాయణ రావును మంత్రి పదవి నుంచి తప్పించారనే ఊహాగానాలు కూడా అప్పట్లో చెలరేగాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు విలీనం చేసి, కాంగ్రెసులో కీలక పాత్ర పోషించడానికి సిద్ధపడిన చిరంజీవికి దాసరి నారాయణ రావు దగ్గరవుతారా, కాంగ్రెసుకు మరింత దూరమవుతారా అనే సందేహం తలెత్తుతోంది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చిరంజీవిపై ఆగ్రహంతోనే తెలుగుదేశం పార్టీకి చెందిన బాలకృష్ణ దాసరి నారాయణ రావు పరమవీర చక్ర సినిమా తీయడానికి సిద్దఫడ్డారని అంటారు.

అయితే, బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన నేపథ్యంలో చిరంజీవికి, దాసరి నారాయణరావుకు మధ్య సంధి కుదురుతుందా అనే ఆసక్తి చోటు చేసుకుంది. బొత్స సత్యనారాయణ చిరంజీవిని గానీ దాసరి నారాయణ రావును గానీ దూరం చేసుకోవడానికి సిద్దంగా లేరని అంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ నియమితులైన నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందినవారంతా ఏకమై అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యం ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో చిరంజీవిని, దాసరి నారాయణరావును కలపడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత బొత్స సత్యనారాయణ చిరంజీవినే కాకుండా, దాసరి నారాయణ రావును కూడా కలిశారు. బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాసరి నారాయణ రావు కూడా వచ్చారు. దీన్ని బట్టి చిరంజీవి, దాసరి మధ్య విభేదాలను రూపుమాపే లక్ష్యంతో బొత్స పనిచేస్తారని అంటున్నారు. అయితే, అనూహ్యంగా రామ్ చరణ్ తేజ్ బాంబు పేల్చడంతో పరిస్థితి మొదటికి వచ్చిందని అంటున్నారు. దాసరి నారాయణ రావు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ రామ్ చరణ్ తేజ్ా బహిరంగంగా మాట్లాడారు. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది.

దాసరికి మద్దతు ఇస్తున్న నిర్మాత నట్టికుమార్ రామ్ చరణ్ తేజ్పై తీవ్రంగా మండిపడ్డారు. దాసరి అనుభవమంత కూడా రామ్ చరణ్ తేజ్ వయస్సు లేదని, చిరంజీవిలాంటివారే దాసరిని గురువు అని సంబోధిస్తారని, రామ్ చరణ్ తేజ్ చేసిన సినిమాలు రెండేనని, అందులో ఒకటి హిట్ - మరోటి ఫట్ అని నట్టి కుమార్ అన్నారు. దాంతో రామ్ చరణ్ తేజ్ వివరణ ఇచ్చుకున్నారు. తాను దాసరి అంతటి పెద్దవాడ్ని అనేంతవాడ్ని కానని చెప్పుకున్నారు. అయితే, దీంతో వివాదం సద్దుమణగడం కష్టమేనని అంటున్నారు. కాగా, రామ్ చరణ్ తేజ్ వివాదాన్ని కావాలనే సృష్టించారని కూడా అంటున్నారు. బొత్స సత్యనారాయణకు దగ్గరై కాంగ్రెసులో కీలక పాత్ర పోషిస్తారని అనుమానించి, అందుకు దూరం చేయడానికే దాసరిపై ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. దాసరి నారాయణ రావు కాంగ్రెసులో తిరిగి చురుగ్గా పనిచేసే పరిస్థితి రాకూడదనేది చిరంజీవి అభిమతమని చెబుతున్నారు. ఏమైనా, ఇరువురి మధ్య స్నేహం చిగురించడం అంత సులభం కాదని అంటున్నారు.

English summary
In a changed equations in Congress party Dasari Narayana Rao and Chiranjeevi may become close.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X