వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో అదృష్టం పరీక్షించుకోనున్న జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
అవిశ్వాస తీర్మానం సందర్భంగా తన బలం చాటుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన బలమంతా సీమాంధ్రలోనే. తన ఓదార్పు యాత్రను కూడా ఇప్పటి వరకు ఆ ప్రాంతానికే పరిమితం చేశారు. ఇప్పటి వరకు ఆయన తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేపట్టింది లేదు. ఆయన సూచనల ప్రకారం అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో పదిహేను మంది ఎమ్మెల్యేలు సీమాంధ్రకు చెందిన వారైతే, కొండా సురేఖ ఒక్కరే తెలంగాణ వారు. గోనే ప్రకాశ రావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వంటి తదితర నేతలు మినహా తెలంగాణలో ఆయనకు గట్టిగా మద్దతుదారులు లేరనే చెప్పవచ్చు.

కోమటిరెడ్డి సోదరులు జగన్ వర్గం నేతలుగా ముద్రపడినప్పటికీ వారు వాటిని కొట్టి పారేస్తున్నారు. అంతేకాదు అవిశ్వాసం సమయంలోనూ వారు జగన్ సూచనలను పాటించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన బలం తేల్చుకునేందుకు జగన్ సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇందుకు ఆయన ఉప ఎన్నికలను వేదికగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో స్పీకర్ కొందరి రాజీనామాలు ఆమోదించిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై వేటు పడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

సురేఖ స్థానంతో పాటు తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాలలోనూ తన పార్టీ తరఫున అభ్యర్థులను జగన్ నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ విషయం పక్కన పెడితే వైయస్ తనయుడిగా తన సత్తా చాటవచ్చునని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గెలుపు కన్నా ఆ ప్రాంతంలో తన పార్టీ చొచ్చుకు వెళ్లేందుకు ఉప ఎన్నికలు బాగా ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నారట. కొండా సురేఖ సీటు తిరిగి కైవసం చేసుకోవడంతో పాటు, పలు నియోజకవర్గాల్లో టిడిపి, కాంగ్రెసు, టిఆర్ఎస్‌లను ధీటుగా ఎదుర్కొని తెలంగాణలోనూ పార్టీకి ఊపు తీసుకు రావాలని భావిస్తున్నారట. తెలంగాణలో తమ సత్తా నిరూపించుకునేందుకు తెలంగాణలోని జగన్ వర్గం కూడా ఉవ్వీళ్లూరుతోంది.

English summary
It seems, YS Jaganmohan Reddy's party may contest in Telangana region in by poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X