వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడిని వెనక్కి నెట్టిన రాహుల్ గాంధీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi-Rahul Gandhi
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారట. ప్రస్తుత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ప్రధానిగా భావిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని వెనక్కి నెట్టి రాహుల్ గాంధీ ప్రధాని రేసులో ముందు నిలిచాడు. హిందు - సిఎన్ఎన్ - ఐబిఎన్ సంయుక్తంగా నిర్వహించిన స్టేట్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఎక్కువమంది రాహుల్ గాంధీయే ప్రధానిగా ఉండాలని ఓటు వేశారంట. సుమారు ఇరవై రాష్ట్రాలలో పద్దెనిమిది వేల మందిని వారు ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ తర్వాత ప్రధాని ఎవరు కావాలని ప్రజలను అడిగితే రాహుల్ గాంధీయే కావాలని చాలామంది చెప్పారంట. అంతేకాదు ఇప్పటికిప్పుడు మన్మోహన్‌ను తప్పించి రాహుల్‌ను ఆ పీఠంపై కూర్చుండ బెట్టాలని 34 శాతం మంది కోరుకుంటున్నారంట.

రాహుల్ ప్రధాని కావాలని 42 శాతం కోరుకుంటే మన్మోహన్ సింగ్ ప్రస్తుతం కొనసాగాలని 22 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారంట. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ఓటు వేసిన వారు కేవలం ఐదు శాతం మాత్రమేనంట. బిజెపి నేతలందరితో పోలిస్తే రాహుల్ 19 శాతం ఎక్కువగా ప్రజల అభిమానం చూరగొన్నారంట. రాహుల్ దరిదాపులో ఇటు కాంగ్రెసు, అటు బిజెపి నేతలు ఎవరూ లేక పోవడం విశేషం. రాహుల్ గాంధీ నమ్మదగిన వ్యక్తి అని, ఆయన పేదలపై చూపిస్తున్న ప్రేమ నిజమైనదని 54 శాతం మంది అభిప్రాయపడుతున్నారంట. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా అమెరికాలో చికిత్స పొందుతూ రాహుల్‌కు తాత్కాలిక పగ్గాలు అందించిన ఈ సమయంలో వారు సర్వే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.

కాగా పంద్రాగస్టు రోజున కాంగ్రెసు కేంద్ర కార్యాలయంలో జెండా రాహుల్ గాంధీ ఎగుర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశాలలో ఉండటంతో రాహుల్ గాంధీతో జెండా ఎగుర వేయించాలనే యోచనలో కాంగ్రెసు వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. జెండాను ఆవిష్కరింపజేయడం ద్వారా రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు ఏ సమయంలోనైనా చేపట్టవచ్చుననే సంకేతాలను పంపేందుకు కాంగ్రెసు వర్గాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీయే భావి ప్రధాని అనే సంకేతాలు జనాల్లోకి వెళతాయని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
AICC general secretory Rahul Gandhi get more votes to Gujarat CM Narendra Modi in a survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X