ఎక్కడైనా 'సింహా', కానీ తెలంగాణలో కాదా?

Balakrishna
హీరో బాలకృష్ణ ఇప్పటికిప్పుడు వస్తామంటే తెలంగాణవాళ్లం ఆహ్వానించడానికి సిద్ధంగా లేమని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు జైపాల్ యాదవ్ చేసిన ప్రకటన రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి శాసనసభా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన బాలకృష్ణ కోసం తాము రాజీనామా చేసి పోటీకి ఆహ్వానించలేమని చెప్పారు. తమకు బాలకృష్ణ కన్నా తెలంగాణ ముఖ్యమని ఆయన కచ్చితంగా చెప్పేశారు. దీంతో తెలంగాణలో బాలకృష్ణకు ఎదురుగాలి ఎదురవుతోందని అర్థం చేసుకోవచ్చు.

బాలకృష్ణకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్నారు. తెలంగాణలో కూడా ఆయనకు అభిమానులున్నారు. కానీ రాజకీయంగా వచ్చేసరికి తెలంగాణలో బాలకృష్ణ అడుగు పెట్టే పరిస్థితి కూడా ఉండదనేది అంచనా. బాలకృష్ణ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఎంత మాత్రం లేదు. పాత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి పేరుకు మెగాస్టారే. రాజకీయాలకు వచ్చేసరికి చిరంజీవి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితి లేదు. బాలకృష్ణ కూడా తెలంగాణలో తిరగలేరనేది స్పష్టం. అందుకే జైపాల్ యాదవ్ ఆ ప్రకటన చేసి ఉంటారని అర్థం చేసుకోవచ్చు.

గతంలో జైపాల్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుర్తి నుంచి స్వర్గీయ ఎన్టీ రామారావు పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఎన్టీ రామారావు రాజకీయ జీవితంలో ఇదో మహా అపజయం. దీన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పుడు బాలకృష్ణ గురించి జైపాల్ యాదవ్ ప్రకటన చేయడం ఈ దృష్ట్యా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ సమస్య పరిష్కారమయ్యేంత వరకు బాలకృష్ణ తెలంగాణలో అడుగు పెట్టలేరనేది అందరికీ తెలిసిన విషయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+