వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాజకీయం: దళిత్ వర్సెస్ దళిత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయం దళిత్ వర్సెస్ దళిత్‌గా మారింది. తెలంగాణలోని ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యంగా మారిన క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను దెబ్బ తీయడానికి తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడిని ముందుకు తెచ్చింది. తెలంగాణకు చెందిన దళిత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులును ఆయుధంగా పెట్టి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికి సిద్ధపడింది. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు వెనకకు తగ్గి మోత్కుపల్లి నర్సింహులును ముందుకు తెచ్చారు. కెసిఆర్‌పై గత కొద్ది రోజులుగా మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి, తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఆ తిట్ల దండకంపై కెసిఆర్‌కు గానీ, తెరాసకు చెందిన ఇతర అగ్రవర్ణ నాయకులు గానీ ప్రతిస్పందించే స్థితి లేదు. అంతగా మోత్కుపల్లి వ్యాఖ్యలున్నాయి.

మోత్కుపల్లి నర్సింహులు కెసిఆర్‌ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కెసిఆర్ ప్రతిస్పందించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే అది వివాదంగా మారే ప్రమాదం చోటు చేసుకుంది. అలాంటి వివాదం కోసమే మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ స్థితిలో తెరాస నాయకత్వం తమ పార్టీ దళిత నాయకుడు ఎ. చంద్రశేఖర్‌ను రంగంలోకి దింపింది. మోత్కుపల్లి నర్సింహులుపై చంద్రశేఖర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రకంగా తెలంగాణ రాజకీయం ఓ దళిత నాయకుడికి, మరో దళిత నాయకుడికి మధ్య పోరాటంగా మారింది. మోత్కుపల్లి నర్సింహులను జాతి నుంచి బహిష్కరిస్తున్నామని ఏకంగా చంద్రశేఖర్ ప్రకటన చేశారు.

తెలుగుదేశం, తెరాస మధ్య తెలంగాణ రాజకీయం వేడెక్కిన క్రమంలో కాంగ్రెసు తన పని తాను చేసుకుంటూ పోతోంది. గత కొద్ది రోజులుగా కెసిఆర్ ఫామ్ హౌస్‌లో గడుపుతున్నారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడంలో ఆయన మునిగిపోయారని తెరాస నాయకులు అంటున్నారు. అయితే, దాన్ని ఆసరా చేసుకుని తెలుగుదేశం నాయకులు కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

English summary
Telangana politics became a struggle between TDP and TRS dalith leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X