జగన్ భద్రతపై ఎన్నారై బహిరంగ లేఖ

మకుటంలేని మహారాజు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, మీరెల్లప్పుడు మీ నాయకుడిగా భావించిన వైఎస్స్ రాజశేఖర రెడ్డి గారు అనుమానాస్పదంగా మరణం చెందితే, వెల్లువెత్తిన కనీస అనుమానాలని ఇంతవరకు తీర్చలేదు మీరు. ప్రతిసారి మీరు మాట్లాడినప్పుడు రాజన్న మీద ఆవాజ్యమైన ప్రేమని కురిపిస్తారు. కాని మీ చేతల్లో ప్రేమ కనబడక పోగా, ధారాళంగా విషం కురిపిస్తున్నట్టు మాలాంటి వైఎస్సార్ అభిమానులకి అనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే, పెద్దాయనని పోగుట్టుకున్న మాలాంటి దీనులకు, జగన్ యొక్క భద్రత రోజు రోజుకి తీసికట్టు చేస్తున్న మీ, మీ పార్టీ వైఖరి మాకు ఆందోళన కలిగిస్తున్నది. అదే సమయంలో మీ కొత్త మిత్రుడు చంద్రబాబు గారికి భద్రత పెంచుతున్నట్టు న్యూస్ పేపర్స్ ద్వారా తెలుస్తున్నది. దీనివల్ల మాకర్ధమవుతున్నది ఏమంటే మీకు నచ్చినవాల్లని జాగ్రత్తగా చూసుకుంటూ నచ్చనివాల్లని ఇబ్బందులకి గురిచేస్తున్నారు అని.
జెడ్ కేటగిరిలో ఉన్న జగన్ కి మీరు తగ్గించే ఈ భద్రత వల్ల ఆయనకీ ఏదన్నా జరగరానిది జరిగితే మాలాంటి వైఎస్సార్ అభిమానులకి అది శరాఘాతం అవుతుంది. దానికి మీరు, మీ కాంగ్రెస్ పార్టీ చాలా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నామరూపాలు లేకుండా పోతుంది. మీరు వ్యక్తిగతంగా ఈ బాధ్యతని తీసుకోవాల్సి వస్తుంది. ఇది మీకు శ్రేయస్కరం కానే కాదు. ఈ లేఖని మీ బాధ్యతని గుర్తుచేయడానికి అని అనుకుంటారో లేక హెచ్చరికగా తీసుకుంటారో అది మీఇష్టం.
కృతజ్ఞతల తో,
గురవా రెడ్డి, అట్లాంటా, జార్జియా, యు ఎస్ ఏ
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications