తెలంగాణవారికి ఎక్స్‌ట్రా రోల్సేనా?

అయితే ఎవరికి అవకాశం ఇచ్చాడు. అందరు నిర్మాతలు, దర్శకులు మాదిరే ముఖ్య పాత్రదారులకు మాత్రం ఇవ్వలేదు. తెలంగాణ నటీనటులపై అంతగా మమకారం ఉన్న ఆయనకు తెలంగాణకు చెందిన ఒక్కరు కూడా ప్రధాన రోల్ పోషించేవారు కనిపించలేదా, తెలంగాణలో ఆ మాత్రం ప్రతిభ ఉన్నవారు లేరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హీరో ఎవరైనప్పటికీ హీరోకన్నా ప్రధాన పాత్ర సీమాంధ్రకు చెందిన జగపతి బాబుది కాగా మరో ప్రధాన పాత్ర ఉత్తరాదికి చెందిన ప్రముఖ టీవీ నటి స్మృతి ఇరానీది. అంటే శంకర్‌కు జగపతిబాబు, స్మృతి ఇరానీల పాత్రలకు తెలంగాణకు చెందినవారు ఎవరూ దొరకలేదా అని కొంత మంది అడుగుతున్నారు. అంటే ఆయన తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వ్యాపారవస్తువుగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. చిత్రంలో రెండు ప్రధాన పాత్రదారులనే వేరే వారిని పెట్టానని చెప్పినప్పటికీ ఆ ప్రాధాన్యం గల పాత్రలలో ఎవరూ దొరకలేదా అనేది అసలు ప్రశ్న.
హీరోహీరోయిన్లకు కొత్తవారిని తీసుకున్న శంకర్ ఇతర పాత్రలకు తెలంగాణకు చెందిన పది రాష్ట్రాల్లో వెతికి కొత్త వారిని ఎందుకు పట్టుకోలేక పోయాడు. తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ ప్రాంతానికి చెందిన శంకరే తెలంగాణ నటీనటులను గుర్తించనప్పుడు సీమాంధ్రులు గుర్తించలేదని వారిని ప్రశ్నించడం ఎంత వరకు సమంజసం. పలువురు తెలంగాణ నటులు సినిమాల్లో అవకాశం లేక సంఘర్షణకు లోనైన వారున్నారు. ఉద్యమకారులను పక్కన పెట్టి శంకర్ వారిని ఎందుకు తీసుకోలేక పోయాడు. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలేనా. ఉద్యమం పేరుతో వ్యాపార జిమ్మిక్కును శంకర్ ఫాలో అయినట్టుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications