వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉండవల్లి చొరవ: తెలంగాణ సమస్య తీరేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అమెరికా నుంచి తిరిగి రావడంతో తెలంగాణ అంశంపై మళ్లీ కదలిక వచ్చింది. తెలంగాణ సమస్య పరిష్కారం కాకపోవడం సీమాంధ్ర నాయకులకు కూడా ఇబ్బందిగానే ఉంది. సమైక్యాంధ్రను కోరుకుంటున్న నాయకులు కూడా సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కమార్ ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూనే హైదరాబాదు విషయంలోనే సీమాంధ్ర నాయకులు పట్టు బిగిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

హైదరాబాదును రెండు రాష్ట్రాల రాజధానిగా ఉంచడానికి అంగీకరించాలని ఉండవల్లి తెలంగాణ పార్లమెంటు సభ్యులను గురువారం జరిగిన ఓ సమావేశంలో కోరినట్లు వార్తలు వచ్చాయి. సరిహద్దులు, నదీజలాల పంపకం అంశాలను నిపుణుల ద్వారా తేల్చుకోవచ్చునని, సీమాంధ్రులు దశాబ్దాలుగా అనుబంధం పెంచుకున్న హైదరాబాదు మాత్రమే సమస్యగా ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. హైదరాబాదు సాంకేతికంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని, అయితే రెండు రాష్ట్రాలకు రాజధానిగా హైదరాబాదు ఉండాలని ఉండవల్లి ప్రతిపాదించారని అంటున్నారు.

ఉభయ రాష్ట్రాలకు హైదరాబాదు రాజధానిగా ఉండడం సాధ్యం కాదని, సీమాంధ్రులు దానికి అంగీకరించకపోవచ్చునని, ఐదేళ్లో పదేళ్లో ఉమ్మడి రాజధానిగా ఉంచి సీమాంధ్రలో రాజధానిని అభివృద్ధి చేసుకుంటే మంచిదని తెలంగాణ పార్లమెంటు సభ్యులు అన్నారు. సమస్య పరిష్కారానికి ఉభయ ప్రాంతాల ప్రతినిధులతో హైదరాబాదులో గానీ ఢిల్లీలో గానీ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ముందుకు వస్తున్నట్లు సమాచారం. చర్చల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సురేష్ షేట్కర్, బలరాంనాయక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీనియర్ నేత కమలాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ దిలీప్ కూడా పాల్గొన్నారు.

English summary
Congress MP from Seemandhra Undavalli Arun Kumar is putting efforts to solve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X