తెలంగాణలో జగన్ కోసం ఎదురు చూస్తున్నదెవరు?

YS Jaganmohan Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో అడుగు పెట్టాలని అక్కడి నేతలు ఎవరైనా ఎదురు చూస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు హవా కొనసాగుతోంది. ఆయనతో పాటు ఎమ్మెల్యేలైన ఆయన కుటుంబ సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హవా కూడా కొనసాగుతోంది. ఇక తెలుగుదేశం పార్టీలోనూ తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రస్తుతం తెలంగాణలో వీరిదే హల్ చల్.

ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో ఉన్న తమ ప్రాధాన్యత క్రమంగా తగ్గుతోందని తెలంగాణ ప్రాంతంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు భావిస్తున్నారట. తెలంగాణ ప్రాంతంలో తాము మళ్లీ బలపడాలంటే వైయస్ జగన్ తెలంగాణలో అడుగు పెట్టాలని వారు భావిస్తున్నారట. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శించినందుకు గతంలో వరంగల్ జిల్లాలో జగన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అయితే అప్పుడు జగన్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్లకార్డు పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన సొంతగా పార్టీ పెట్టారు. కానీ ఇప్పటి వరకు తన నిర్ణయం చెప్పలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజలలో తెలంగాణ పట్ల వ్యతిరేకత లేని దృష్ట్యా జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ అడుగు పెట్టాలని వారు భావిస్తున్నారు.

జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని తెలంగాణలో అడుగు పెడితే ఆయన సామాజిక వర్గం నేతలే కాకుండా చాలామంది ఆయనతో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనేది పలువురి వాదన. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎప్పటికైనా జగన్ వెంట వెళ్లే వారనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి. తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి కూడా జగన్ వైపు వెళతారనే ఊహాగానాలు అప్పట్లో వినిపించాయి. వీరంతా జగన్ వెంట వెళ్లే అంశాన్ని ఖండించినప్పటికీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆయనతో ఖచ్చితంగా వెళ్లే అవకాశాలే ఎక్కువనే వారూ ఉన్నారు. ఇక ఇప్పటికే వరంగల్ జిల్లా రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, నిజామాబాద్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కరీంనగర్ నుండి గోనె ప్రకాశ రావు తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+