వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక: ఎవరీ బియస్ యడ్యూరప్ప?

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బిజెపి అధిష్టానాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి బియస్ యడ్యూరప్ప పూర్తి పేరు బూకనకేరే సిద్ధలింగప్ప యడ్యూరప్ప. ఆయన కర్ణాటక రాష్టానికి 25వ ముఖ్యమంత్రి కాగా, దక్షిణాది రాష్ట్రంలో తొలి బిజెపి ముఖ్యమంత్రి. ఆయన 1943 ఫిబ్రవరి 27వ తేదీన జన్మించారు. లింగాయత్ కమ్యూనిటీకి చెందినవారు. అదే ఆయనకు ముఖ్యమంత్రి పదవిని దగ్గర చేసింది ఆయన మాండ్యా జిల్లా కెఆర్ పేట తాలూకా బూకనకేరేలో సిద్ధలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు జన్మించారు.

ఆయన 1967లో మైత్రాదేవి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. ఆయన భార్య 2004లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. బావిలో పడి ఆమె మృతి చెందింది. కారణమేమిటనేది తెలియదు. ఆర్ట్స్‌లో డిగ్రీ తీసుకున్న యడ్యూరప్ప సాంఘిక సంక్షేమ శాఖలో గుమస్తాగా పనిచేశారు ఆ తర్వాత శిజారిపూర్‌కు మారి వీరభద్ర శాస్త్రి శంకర్ రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేశారు ఆ తర్వాత ఆయన షిమోగాలో హార్డ్‌వేర్ షాపు పెట్టారు.

యడ్యూరప్ప తన రాజకీయ జీవితాన్ని 1979లో ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ షికారిపూర్ కార్యదర్శి అయ్యారు. అత్యవసర పరిస్థితి కాలంలో 1975, 1977ల్లో జైలుకు కూడా వెళ్లారు. షిమోగా, బళ్లారి జైల్లో ఉన్నాడు. ధరమ్ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చడంలో హెచ్‌డి కుమారస్వామికి సహకరించడం ద్వారా యడ్యూరప్ప వెలుగులోకి వచ్చారు. కుమారస్వామి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఆర్థిక శాఖను నిర్వహించారు. ఆ తర్వాత కుమారస్వామిని దించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి అయ్యారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత యడ్యూరప్పను వివాదాలు చుట్టుముడుతూ వచ్చాయి. భూకేటాయింపులో తన కుమారుడికి మేలు చేశాడనే ఆరోపణ వచ్చింది. కర్ణాటకలో ఇది అతి పెద్ద భూ కుంభకోణం. దైవంపై మొక్కవోని విశ్వాసం ఉన్న యడ్యూరప్పను ఇప్పుడు మైనింగ్ కుంభకోణం ఇరకాటంలో పెట్టింది.

English summary
Bookanakere Siddalingappa Yeddyurappa popularly known as BS Yeddyurappa is the 25 the Chief Minister of Karnataka, belonging to BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X