నాగ్ సినిమా తెచ్చిపెట్టిన కష్టాలు- పీకల్లోతు ఇరుక్కున్న చెన్నై సూపర్ కింగ్స్

ఇంకొద్దిరోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇటీవలే విడుదల అయింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఈ టోర్నీ ఈ నెల 28వ తేదీన గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. రెండు విడతల్లో కొనసాగుతుంది. ఈ తొలి దశలో 20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొత్తం 10 స్టేడియాలు- బెంగళూరు, ముంబై, గువాహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ వీటికి వేదిక.

ఈ దశలో నాలుగు డబుల్ హెడర్స్ ఉంటాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30, సాయంత్రం 7:30 మొదలవుతాయి. తొలి మ్యాచ్ అనంతరం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. సీజన్ మొదటి డబుల్ హెడర్ ఏప్రిల్ 4న. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌తో మధ్యాహ్నం, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌తో రాత్రి తలపడతాయి.

Sun TV Files Civil Suit in Madras High Court to Stop CSK from Using Rajinikanth Songs in Promos

ఈ పరిస్థితుల మధ్య చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ ట్రబుల్ లో పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేసింది. ఈ మధ్యంతర ఇంజక్షన్ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి విచారించారు.

రజినీకాంత్ నటించిన జైలర్, కూలీ, 'జైలర్ 2' పాటలను తమ ప్రమోషనల్ వీడియోల్లో ఉపయోగించినందుకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లిమిటెడ్‌పై సన్ రైజర్స్ నెట్ వర్క్ ఈ కేసు వేసింది. ఆయా సినిమాలన్నింటినీ కూడా సన్ నెట్ వర్క్ నిర్మించినవే కావడం వల్ల కాపీ రైట్స్ తమకే ఉంటాయని తెలిపింది. అక్కినేని నాగార్జున మొదటిసారిగా విలన్ గా నటించిన సినిమా.. కూలీ. ఇందులోని బీజీఎం, పాటలు యథేచ్ఛగా వాడుకోవడం పట్ల సన్ నెట్ వర్క్ అభ్యంతరం తెలిపింది.

సన్ టీవీ తరపున సీనియర్ న్యాయమూర్తి రవీంద్రన్ వాదనలు వినిపించారు. తాము అభ్యంతరం చెప్పిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆ పాటలను ప్రమోషన్ల నుండి తొలగించిందని కోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి కాపీరైట్ ఉల్లంఘనలు జరగకూడదని ఆయన కోరారు.

అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సీనియర్ న్యాయవాది పీఎస్ రామన్ కూడా తన వాదనలను వినిపించారు. తమ ప్రమోషనల్ వీడియోల నుండి ఆ పాటలను తీసివేసినట్లు ధృవీకరించారు. సంబంధిత అధికారుల నుండి సరైన లైసెన్స్ పొందకుండా వాటిని తిరిగి ఉపయోగించబోమని కోర్టుకు హామీ ఇచ్చారు.వాదనలను విన్న అనంతరం న్యాయమూర్తి కేసును ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+