సర్వే: సీమాంధ్రలో జగన్ స్వీప్, తెలంగాణలో దారుణం

తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఏడు శాతం ఓట్లు మాత్రమే పోలవుతాయని సర్వేలో తేలింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలంగాణ ప్రాంతంలో స్పష్టమైన ఆధిక్యత చూపుతుంది. తెరాసకు తెలంగాణలో 36 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెసు పార్టీకి 20 శాతం ఓట్లు వస్తాయని తేలింది. దీన్నిబట్టి కాంగ్రెసు పార్టీ అధికారం కోల్పోవడం ఖాయమని సర్వే అభిప్రాయపడింది. సీమాంధ్రలో జగన్, తెలంగాణలో కెసిఆర్ తిరుగులేని మెజారిటీ సాధిస్తారని తెలిపింది.
కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బ తింటుందని, సీమాంధ్రలో మాత్రం చావు దప్పి కన్ను లొట్టపోయినట్లుగా 20 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే తెలిపింది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం గానీ, అవినీతి వ్యతిరేక పోరాటం గానీ ఏ మాత్రం ఫలితం ఇచ్చే అవకాశాలు లేవని తెలిసిపోతోంది.












Click it and Unblock the Notifications