వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల యాత్ర: అనిల్‌ను జగన్ దూరంగా పెట్టారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anil - Sharmila
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన బావ బ్రదర్ అనిల్ కుమార్‌ను తన సోదరి షర్మిల పాదయాత్రలో పాల్గొనవద్దని ఆదేశించారా అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసును క్రైస్తవుల పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నందున అనిల్ కుమార్ కూడా షర్మిల యాత్రలో పాల్గొంటే ఆ ముద్ర మరింత బలపడే భయంతోనే జగన్ తన బావను పాదయాత్రలో పాల్గొనవద్దని సూచించారట.

2003లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు ఆయన సతీమణి, తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఆయన భార్య భువనేశ్వరి పాల్గొంటున్నారు. పాదయాత్ర చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తుంటారు. షర్మిల తన సోదరుడి కోసం మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు.

తాను ఓ మహిళను అని కూడా లెక్క చేయకుండా ఇప్పటి వరకు ఎవరూ చేయని పాదయాత్రను ఆమె కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఇటీవల అనంతపురం జిల్లాలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి సందర్భాలలో ఆమె తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వదిన భారతి వచ్చి వెళ్లారు. వీరిద్దరు పలుమార్లు భారతి యాత్రలో పాల్గొన్నారు. కానీ భర్త అనిల్ కుమార్ మాత్రం ఇప్పటి వరకు పాల్గొనలేదు.

ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే జగన్ ఆదేశాల మేరకే అనిల్ పాదయాత్రకు దూరంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో జగన్‌కు అనుకూలంగా చర్చిల్లో ప్రార్థనలు చేయాలని అనిల్ పాస్టర్లకు మెసేజ్‌లు పెట్టడంతో పాటు ఆయన క్రైస్తవ మత ప్రబోధకుడు. దీంతో ఆయన షర్మిల యాత్రలో పాల్గొంటే ఎక్కడ ఇతర వర్గాలు తమకు దూరమవుతాయో అనే ఆందోళనతో జగనే ఆయనను దూరంగా పెట్టారని అంటున్నారు.

English summary
It is said that YSR Congress party chief YS Jaganmohan Reddy ordered Brother Anil Kumar to make distance with Sharmila's padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X