వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ తరహాలో ఇక ప్రజల్లోకి చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి చేతులు ముడుచుకుని కూర్చోవాలని అనుకోవడం లేదు. ప్రజల్లోకి వెళ్లి తన ఇమేజ్‌ను మరింత పెంచుకోవడానికి ఆయన తగిన ప్రణాళిక రచిస్తున్నారు. ఆయన ఆగస్టు నుంచి రాష్ట్ర పర్యటనకు పూనుకోవచ్చునని అంటున్నారు. ఇది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన ఇందిరమ్మ బాట తరహాలో ఉంటుందని కూడా చెబుతున్నారు. తన పర్యటనల్లో ఆయన ప్రజల చెంతకు వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుంటారు.

ప్రజల్లో కలిసిపోయి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే మార్గంలో ఆయన ఆలోచన సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ రకంగా ఆయన కాంగ్రెసులో తిరుగులేని నాయకుడిగా ఎదగాలని అనుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన గ్రామాలు తిరగాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రుళ్లు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బస చేస్తారని చెబుతున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే దిశగా ఆయన ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా ఆదరణనను, ఆభిమానాన్ని సంపాదించుకోవాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ప్రజా సమస్యలను తెలుసుకుని, సాధ్యమైనవాటిని తక్షణ పరిష్కరించడానికి అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారని చెబుతున్నారు. సామాన్య ప్రజానీకంతో కలిసి ప్రభుత్వ పథకాల ఫలితాలు వారికి అందేలా చూడడానికి చిరంజీవి ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. ఆగస్టు నుంచి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతారని సమాచారం. రైతు సమస్యలపై, హాస్టళ్లలో వసతులపై, నిరుపేదల గృహనిర్మాణ కార్యక్రమంపై, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై చిరంజీవి తన జిల్లా పర్యటనల్లో దృష్టి పెడతారని సమాచారం.

English summary
In an attempt to build up his image among the people, actor-turned-politician Chiranjeevi is planning to fan out to districts in August. The star politician will engage himself in discussions with people to find out their pressing problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X