వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానం సీరియస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు అధిష్టానం సీరియస్‌గా ఉంది. సమాచార హక్కు కమీషనర్ల నియామకం విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కుమ్మక్కయినట్లు వచ్చిన వార్తలపై అధిష్టానం మండిపడుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి ఓ అవగాహనకు వచ్చినట్లుగానే కాంగ్రెసు అధిష్టానం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి ప్రకటన ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై ముఖ్యమంత్రిని అధిష్టానం వివరణ కోరినట్లు, వివరణ రాగానే పార్టీ స్పందించనున్నట్లు ఆమె చెప్పారు. దీన్నిబట్టి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలను కూడా అధిష్టానం సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సమాచార హక్కు కమిషనర్ల నియామకం వ్యవహారమే ఇప్పుడు ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై విరుచుకుపడడానికి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా అదే విషయాన్ని ఓ అస్త్రంగా ఎంచుకున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ నాయకులను, మంత్రులను చేరదీస్తున్నారు. అదే సమయంలో సమాచార హక్కు కమిషనర్ల నియామకం వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేదిగా ఉందని ఆయన ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.

చంద్రబాబుతో కుమ్మక్కు వ్యవహారం ప్రధానమైన అంశం కాగా, రాజకీయపరమైన నియామకాలనే విమర్శలు రావడం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి సమస్యగానే మారింది. చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే కాకుండా సొంత పార్టీవారు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
According to AICC spokesperson Renuka Chaudhary's statement - Congress high command is serious on CM Kiran kumar Reddy on right information commissioners appointmee
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X