వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స సత్తిబాబుకు ఎదురు గాలి వీస్తుందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు సంకటం పరిస్థితుల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయనకు సొంత పార్టీలోనే ఎదురు గాలి వీస్తుందని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా పెట్టుకున్న బొత్సకు ఇటీవలి కాలంలో అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయని అంటున్నారు. సిఎంతో విభేదాలు, ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువలు పార్టీలో ఆయన ఇమేజ్‌ని తగ్గిస్తున్నాయని అంటున్నారు. తాను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలన్న తన లక్ష్యాన్ని బొత్స సూటిగానే చెప్పేశారు. అయితే ఆయన ఓర్పుగా కాకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఆయనకు నష్టం కలిగిస్తుందని అంటున్నారు. నిత్యం ఢిల్లీ పర్యటనలు చేస్తూ అధిష్టానానికి ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేస్తున్నారనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ అన్నప్పుడల్లా ఆయన ఢిల్లీ వెళ్లి విస్తరణ జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స వివాదం ఓ సమయంలో అధిష్టానానికి ఇరువురు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసే స్థాయికి వెళ్లి పోయింది. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా వారిని మచ్చిక చేసుకోవాలని కిరణ్ భావిస్తుండగా బొత్స మాత్రం వేటు కోసం పట్టుబడుతున్నారు. మొదట్లో కిరణ్‌పై కొంత అసంతృప్తిగా ఉన్న అధిష్టానం ఆ తర్వాత కాస్త ఆయనకు పట్టు కల్పించింది. మంత్రులు, ఎమ్మెల్యేల్లో బొత్స అసంతృప్తి రాజేస్తూ కిరణ్‌పైకి ఉసిగొల్పుతున్నారనే అంశం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో బొత్సపై ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌కు పలువురు నేతలు బొత్సపై ఫిర్యాదులు చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో మద్యంపై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలోనూ బొత్స సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మంగళవారం ఆయన సమావేశాలకు హాజరయ్యారు. పంట విరామంపై చర్చ జరుగుతుండగా బొత్స మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ మాత్రం ఆయన మైక్ కట్ చేసి ఝలక్ ఇచ్చారు. ప్రజల్లో ఇమేజ్ ఉన్న నేత, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కూడా క్రమంగా బొత్సకు దూరమవుతూ కిరణ్‌కు దగ్గరవుతున్నారు. ప్రస్తుతం పార్టీలో బొత్సకు ఎదురు గాలి వీస్తుందని అంటున్నారు. పిసిసి చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు కనిపించిన ఉత్సాహం బొత్సలో ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారు. కొత్తలో దూకుడుగా వ్యవహరించిన బొత్స ఇటీవలి కాలంలో మౌనంగా ఉంటున్నారని.. పార్టీలో ఆయన ప్రధాన్యత క్రమంగా తగ్గుతుండటమే అందుకు కారణమంటున్నారు.

English summary
It seems, PCC chief Botsa Satyanarayana in crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X