రాయదుర్గం: 'గాలి' కోటలో జగన్ హవా కొనసాగేనా!?

YS Jagan - Gali Janardhan Reddy
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కోటలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాగా వేస్తారా అనే చర్చ ఆసక్తికరంగా అనంతపురం జిల్లాలో జరుగుతోంది. అనంతపురం లోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. గాలి కర్నాటకలో రాజకీయాలు చేస్తున్నప్పటికీ అనంతపురం జిల్లాలో ఆయనకు, ఆయన వర్గానికి మంచి పట్టు ఉంది.

ఇది వైయస్ జగన్ అభ్యర్థికి రాయదుర్గం నియోజకవర్గంలో కలిసి వస్తుందని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున తాజా మాజీ శాసనసభ్యుడు కాపు రామచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన గత ఎన్నికలలో గాలి అండతోనే అక్కడ గెలుపొందారనే వాదన ఉంది. ఇప్పుడు కూడా ఆయనకు పుష్కలంగా గాలి వర్గం అండ ఉంది. గాలి జైల్లో ఉన్నప్పటికీ అతనికి మద్దతుగా బిజెపి నుండి బయటకు వచ్చి బిఎస్సార్ పార్టీ స్థాపించిన శ్రీరాములు ఇక్కడ కాపు గెలుపు కోసం జగన్ కంటే ఎక్కువగా కృషి చేస్తున్నారని అంటున్నారు.

గాలి జనార్ధన్ రెడ్డి, వైయస్ జగన్ అరెస్టుల నేపథ్యంలో రాయదుర్గం మరింత ప్రాచుర్యం సంతరించుకుంది. దీంతో, రాయదుర్గం కోటను కొట్టేదెవరో అనే ఆసక్తి పొరుగున ఉన్న కన్నడియుల్లోనూ కనిపిస్తుంది. ఇవన్నీ కలిసి ఉప ఎన్నికలు జరుగుతున్న పద్దెనిమిది స్థానాల్లో రాయదుర్గానికి ప్రత్యేక ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టాయి. రాయదుర్గం బరిలో తలపడుతున్న ముగ్గురూ రెడ్డి సామాజికవర్గం నేతలే. దీంతో ఆ వర్గం ఓట్లలో భారీ చీలిక తప్పదని భావిస్తున్నారు.

దీంతో మూడు ప్రధాన పార్టీలూ ఇతర వర్గాల ఓట్లకే గేలం వేసే పనిలో ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుణపాటి దీపక్‌ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థిగా కాపు రామచంద్రా రెడ్డిల మధ్య పోరు హోరాహోరీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, వైయస్సార్ పార్టీల అభ్యర్థులకు నియోజకవర్గంలో బంధుగణం ఎక్కువగా ఉండటం వారికి కలిసి వచ్చే అంశం.

అత్యధికంగా ఉన్న బిసి ఓటర్లను తెలుగుదేశం పార్టీ నమ్ముకుంది. గాలి, జగన్‌ల అవినీతినే ప్రచారాస్త్రాలుగా చేసుకొని ముందుకు సాగుతోంది. మరోవైపు వేణు గోపాల్‌ రెడ్డి స్థానికుడు కావడం కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. అలాగే ప్రభుత్వ పథకాలే గట్టెక్కిస్తాయన్న ధీమాను కూడా ప్రదర్శిస్తోంది. పాటిల్ గెలుపు కోసం మంత్రి రఘువీరా రెడ్డి అంతా తానై వ్యవహరిస్తున్నారు. వైయస్ హయాం అభివృద్ధి, పథకాలకు తోడు, వైయస్ రాజశేఖరరెడ్డి మృతి, జగన్ అరెస్టు తెచ్చిపెట్టే సానుభూతితో నెట్టుకురావాలని వైయస్సార్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.

అలాగే, మైనారిటీ వర్గాల్లో కూడా అధికశాతం తమ వైపు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జగన్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్ర రెడ్డి పైన స్థానికంగా వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఈ కారణంగానే ఆయన రాజీనామా చేసిన అనంతరం పోటీకి విముఖత చూపారట. అయితే జగన్, గాలి వర్గం ఒప్పించి అతనిని రంగంలోకి దింపారని తెలుస్తోంది. గెలుపు బాధ్యతను జగన్, శ్రీరాములు తమదే అని కాపుకు హామీ ఇచ్చారట. అందుకే కాపు గెలుపు కోసం శ్రీరాములు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+