వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విగ్రహ రాజకీయాలు: జగన్‌తో బాలయ్య పోటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna-YS Jagan
రాష్ట్రంలో విగ్రహాల రాజకీయాలు ఊపందుకున్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెద్ద యెత్తున వస్తుండడంతో దానికి విరుగుడు కనిపెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించినట్లు కనిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వైయస్ విగ్రహాలను కూల్చేస్తామని చంద్రబాబు ఓ సంచలన ప్రకటన చేశారు. దీంతో రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెసు నాయకులు కూడా దుమ్మెత్తిపోశారు. ఊరూరా వైయస్సార్ విగ్రహాలను స్థాపించడం ద్వారా వైయస్ జగన్ తన రాజకీయాలను ముందుకు తీసుకుని వెళ్లే పనికి పూనుకున్నారు.

వైయస్ జగన్ విగ్రహ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం కూడా వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఒక్కసారిగా బాలకృష్ణ రాజకీయాల్లోకి దూసుకొచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాలను ప్రారంభిస్తూ ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. వైయస్ జగన్ రాజకీయాలను దీటుగా ఎదుర్కోవడానికి ఎన్టీఆర్ విగ్రహాలను స్థాపించే పనిని పెద్ద యెత్తున చేపట్టాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో ఆయన ఎన్టీ రామారావు విగ్రహాలను స్థాపించడమే కాకుండా రాజకీయాలను వేడెక్కించే ప్రసంగాలు చేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు చంద్రబాబు భయపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శోభా నాగిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా నాయకుడు లేదంటే మహానాయకుడు ఎవరనే విషయంలో బాలయ్యకు, వైయస్ జగన్‌కు మధ్య పోటీ నెలకొన్నట్లే చెప్పాలి. విగ్రహాల విషయంలో ఇద్దరు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.

English summary
TDP leader and cine hero Balakrishna mat compete with YSR Congress president YS Jagan in statue politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X