మోడీకి జై: 4వ జట్టులో జగన్, బాబు మూడు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: వచ్చే సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు కాంగ్రెసు నేతృత్వంలోని యూపిఏ కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ - సి ఓటర్ - ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. అయితే ఎన్డీయే, యూపిఏలు అధికార పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు మాత్రం క్లిష్టంగా ఉన్నాయి.
అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే 272 సీట్లు కావాలి. కానీ, 131 స్థానాలతో బిజెపి అతిపెద్ద పార్టీగా, ఇక కాంగ్రెస్ 119 సీట్లతోనే రెండో స్థానంతో సరిపెట్టుకోనుందని సర్వే ఫలితాల చెబుతున్నాయి. ఎన్డీయేకు 156, యూపిఏకు 131 స్థానాలు వస్తాయి. ఆ పార్టీలు అధికారం చేజిక్కించుకోవాలంటే ఇంకా వందకు పైగా సీట్లు అవసరం.
ఈ నేపథ్యంలో ములాయం సింగ్ ఆధ్వర్యంలోని సమాజ్‌వాది పార్టీ, మాయావతి ఆధ్వర్యంలోని బహుజన సమాజ్ పార్టీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసు, జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె పార్టీలు కీలకం కానున్నాయి. పార్టీల పరంగా బిజెపి, కాంగ్రెసు తర్వాత ఎస్పీ 33 సీట్లతో మూడో స్థానంలో నిలువనుందని సర్వే చెబుతోంది.

నరేంద్ర మోడీ - రాహుల్ గాంధీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని 37.7 శాతం ఓటర్లు ప్రధానిగా కోరుకుంటే, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని 17.6 శాతం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను 6.2 శాతం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని 3.9 శాతం కోరుకుంటున్నారు.

మోడీ ప్రాబల్యం...
నరేంద్ర మోడీ క్రమంగా పుంజుకుంటుండటం, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెసు ముందస్తు వ్యూహంలో ఉందంటున్నారు. నవంబరులో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ములాయం జోరు
ములాయం సింగ్ ఆధ్వర్యంలోని ఎస్పీ ఎన్నికల్లో 33 సీట్లు సాధించి ప్రాంతీయ పార్టీల సత్తా చాటనుంది. ఆయా రాష్ట్రాల్లోని మిగిలిన పార్టీలు కూడా సత్తా చాటనున్నాయి. ప్రాంతాయ పార్టీల హవా నేపథ్యంలో మూడో కూటమి అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు.

మమతా బెనర్జీ - మాయావతి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తదితరులు తమ తమ రాష్ట్రాల్లో సత్తా చాటడం ద్వారా ప్రాంతీయ హవా చాటనున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో వీరి పాత్ర కీలకంగా మారనుంది.

జయలలిత
అన్నాడీఎంకె నేతృత్వంలోని నాలుగో ఫ్రంట్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని సర్వే తెలిపింది. ఈసారి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బిజెపిలకు వచ్చే సీట్ల సంఖ్యను కలిపినా సాధారణ మెజారిటీ సాధించలేవని, ఇలా జరగడం ఇదే తొలిసారని సర్వే సంస్థలు విశ్లేషించాయి.

ఎపిలో...
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీగా నష్టం జరుగుతుందని వెల్లడైంది. సర్వే ప్రకారం రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అత్యధికంగా 14, తెలంగాణ రాష్ట్ర సమితికి 11, తెలుగుదేశం పార్టీకి 9, కాంగ్రెస్‌కు 7 సీట్లు వస్తాయని, బిజెపి బోణీ కొట్టకపోవచ్చునని తేలింది.

మమత కూటమిలో వైయస్ జగన్!
ఎపిలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జయలలిత, మమతా బెనర్జీ కూటమిలో ఉండే అవకాశాలున్నాయి. తెరాస కూడా ఈ కూటమిలో చేరే అవకాశాలున్నాయట. అయితే కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీతో జత కట్టవచ్చు.












Click it and Unblock the Notifications