ఉమ్మడి రాజధాని: హైదరాబాద్‌పై కేంద్రం ఆరా

జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏల పైన, ప్రస్తుత పరిస్థితులపై నివేదికలు కోరింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు శాంతిభద్రతలు తదితరాలను కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిని ఏ విధంగా వర్గీకరించాలన్న విషయమై కేంద్రం పరిశీలిస్తోంది. హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసి పరిధిని తీసుకోవాలా లేక హెచ్ఎండిఏ పరిధిని తీసుకోవాలా అన్ని విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తోందని సమాచారం.
గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ కలిపి ఎంసిహెచ్‌గా ఉండేవి. ఆరేళ్ల క్రితం రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని పన్నెండు మున్సిపాలిటీలను కలిపి జిహెచ్ఎంసిగా మార్చారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి విస్తీర్ణం 625 చ.కి.మీ.గా ఉంది. జిహెచ్ఎంసి పరిధిలో 22 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంటు స్థానాలున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ పరిధిని విస్తరించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ(హెచ్ఎండిఏ)గా మార్చారు.
దీని విస్తీర్ణం 7వేల చ.కి.మీ. ఉండగా... ఇందులోకి 32 శాసన సభ స్థానాలు, 7 పార్లమెంటు నియోజకవర్గాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లాల రెవెన్యూ పరిధికి లోబడి శాసన సభ స్థానాలు ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ప్రజలున్నారు? హైదరాబాద్ జిల్లా, జిహెచ్ఎంసి పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మెదక్ జిల్లాలోని ప్రాంతాల జనాభా, మౌలిక సదుపాయాల వివరాలను సేకరిస్తోంది.












Click it and Unblock the Notifications