వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇద్దరికే కాదు: 14గంటలు గెస్ట్‌హౌస్‌లోనే కిరణ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎన్నికల కోడ్ తగిలింది! గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఎన్నికల కోడ్ కారణంగా ముఖ్యమంత్రి వచ్చిన హడావుడి ఎక్కడా కనిపించలేదు. కిరణ్ కూడా ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకొని పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మంగళ, బుధవారాల్లో సుమారు ఇరవై గంటల పాటు కిరణ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నా ఎలాంటి హడావుడి లేదు.

ఉన్న ఇరవై గంటల్లో 14 గంటలపాటు రాజమండ్రి ఆర్ అండ్ బి అతిథి గృహంలోనే గడిపారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో మంతనాలు అక్కడే జరిపారు. వివిధ వర్గాల నుంచి వినతిపత్రాలు స్వీకరించినప్పటికీ ఫొటోకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంత్రి విశ్వరూప్ కుమారుడి వివాహం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నవదంపతులను ఆశీర్వదించడానికి మంగళవారం ఆయన జిల్లాకు వచ్చారు.

ఆ రోజు రాత్రి రాజమండ్రి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. బుధవారం ఉదయం పది గంటల వరకు అక్కడే ఉన్నారు. తరువాత మధురపూడి విమానాశ్రయం నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ముఖ్యమంత్రి అతిథి గృహంలో ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు సైలెంట్‌గా చేశారు. పలువురు మంత్రులు, నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. బయట మాత్రం కిరణ్ మౌనంగానే ఉన్నారు. ఎవరు పలకరించినా ఓ చిరునవ్వుతో సరిపెట్టారు.

గుంటూరు జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నల్గొండ జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల యాత్రలకు ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికే బ్రేక్ పడింది.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా తీసుకువెళ్లేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలను రచించేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని చీఫ్ బొత్స సత్యనారాయణ నిర్ణయించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావించే స్థానిక ఎన్నికలను సత్వరమే జరపాలన్న యోచనలో బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిఉన్నారు.

English summary
CM Kiran Kumar Reddy face Election code in East Godavari district on Tuesday and Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X