హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగ్గురు మూడు చోట్ల: తెలంగాణలో లోకేష్ పోటీ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh may contest from Hyderabad district
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు! ఎన్నికలకు మరో ఏడాది గడువు మాత్రమే ఉండటంతో ఆయన జిల్లాలను చుట్టేస్తున్నారు. మినీ మహానాడు కార్యక్రమాలలో ఆయా జిల్లాల్లో పాల్గొంటున్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా మహానాడులో పాల్గొన్న లోకేష్ మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో పాల్గొననున్నారు. ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్న నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశం మాత్రం తేలలేదు. యువతను ఉత్సాహపరిచేందుకు, పార్టీ కోసం అన్ని విధాలుగా పని చేసేందుకు లోకేష్ ఎన్నికల్లో దిగాలని ఆయనకు, పార్టీ అధినేతకు పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం చూపే నియోజకవర్గం నుండి పోటీ చేయాలని టిడిపి నేతలు సూచిస్తున్నారట. అవసరమైతే రాష్ట్ర రాజదాని హైదరాబాదులోని ఏదైనా ఓ నియోజకవర్గం నుండి లోకేష్‌ను బరిలోకి దించాలని తెలుగు తమ్ముళ్లు ప్రధానంగా నగర తెలుగు తమ్ముళ్లు ఉబలాటపడుతున్నారట. దీనిపై లోకేష్, పార్టీలోని ఇతర ముఖ్య నేతలు కూడా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం.

చిత్తూరు జిల్లాలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారు. ఆంధ్రా ప్రాంతం నుండి హీరో నందమూరి బాలకృష్ణ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ తెలంగాణ ప్రాంతమైన హైదరాబాదు నుండి పోటీ చేయవచ్చునని చెబుతున్నారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు మూడు ప్రాంతాల్లో పోటీ చేస్తే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు కూడా కోరుతున్నారట.

English summary

 It is said that Telugudesam Party leaders are pressuring party chief Nara Chandrababu Naidu's son Nara Lokesh to contest from Hyderabad district constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X