జగన్ కేసులో కీలక మలుపు: రంగంలోకి ఆర్వోసి

ఈ విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సిబిఐ లేఖ రాయగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్వోసి రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. జగన్ కంపెనీలతో పాటు వాటిలో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇప్పటికి 16 కంపెనీలపై విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు చెందిన బృందాలు ఆయా కంపెనీలపై విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. జగతి పబ్లిక్షన్స్, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, హెటిరో డ్రగ్స్, జనని, భారతి సిమెంట్, ఇండియా సిమెంట్, దాల్మియా సిమెంట్ తదితర కంపెనీలపై ఆర్వోసి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.
సిబిఐ అందజేసిన ప్రశ్నావళులతో ఆర్వోసి బృందం తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. పెట్టుబడుల వ్యవహారాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా నివేదికలు రూపొందించినట్లుగా కూడా తెలుస్తోంది. కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డీ ఆస్తుల కేసును లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో సిబిఐ దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications