ఎక్స్‌పీరియన్స్: ఓదార్పుకు విజయమ్మ రిహార్సల్స్?

YSRCP is planning to Vijayamma odarpu in Telangana
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ తెలంగాణ పర్యటన ఆ పార్టీ వ్యూహాంలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్ విజయమ్మ ఆదివారం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో పర్యటించారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. ఆ కుటుంబాలకు దైర్యం చెప్పారు.

ఆ తర్వాత విజయమ్మ మంగళవారం అదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లో పర్యటిస్తారు. ఇందుకోసం పార్టీకి చెందిన నేతలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో విజయమ్మ తెలంగాణ ప్రాంతంలో ఓదార్పు యాత్ర కూడా చేపట్టనున్నారని సమాచారం. ఓదార్పు యాత్రలో భాగంగానే విజయమ్మ ఇటీవలి తెలంగాణ పర్యటనలు కావొచ్చునని అంటున్నారు. విజయమ్మ ఓదార్పు చేపడితే సాఫిగా సాగిపోతుందా లేదా అని తెలుసుకునేందుకు ముందస్తుగా ఓ రకంగా సిరిసిల్ల, కాగజ్ నగర్ పర్యటనలు రిహార్సల్స్ అంటున్నారు.

గత అనుభావాలను దృష్టిలో పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయమ్మ తెలంగాణ పర్యటనలను ఖరారు చేస్తోందంటున్నారు. గతేడాది విజయమ్మ సిరిసిల్ల పర్యటన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటిస్తే తప్ప ఆ పార్టీని తెలంగాణలో అడుగు పెట్టనిచ్చేది లేదని తెలంగాణవాదులు మొదటి నుండి హెచ్చరిస్తున్నారు.

దీంతో ఆమె గతంలో సిరిసిల్లకు వెళ్లినప్పుడు హైదరాబాదు నుండి సిరిసిల్ల వరకు తెలంగాణవాదులు పలుచోట్ల ఆమె కారును అడ్డుకున్నారు. రాళ్లు రువ్వారు. సభా వేదిక వద్ద కూడా తెలంగాణవాదులు ఆందోళనలు చేపట్టారు. వరంగల్ జిల్లాలో గతంలో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టాలని భావించినప్పుడు మహబూబాబాదులో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఇలాంటి ఘటన నేపథ్యంలో విజయమ్మ ఓదార్పు యాత్ర చేపడితే ఎలా ఉంటుందని తెలుసుకునేందుకే వారు దానికంటే ముందు పర్యటనల పేరుతో రిహార్సల్స్ వేస్తున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+