వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాల తిరుగుబాటు: కెకెకు గండమేనా? (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. తాను పోటీలో ఉన్నానని ప్రకటించడం ద్వారా పోటీని అనివార్యం చేశారు. తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన చైతన్యరాజు ఉపసంహరించుకోగా, ఆదాల ప్రభాకర్ రెడ్డి విరమించుకుంటానని చెబుతూనే పోటీలో ఉన్నానని చివరి నిమిషంలో ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కె. కేశవరావుకు గండం వాటిల్లినట్లేనని భావిస్తున్నారు.

ముగ్గురు అభ్యర్థులను ఎన్నిక చేసుకోవడానికి అవసరమైన శాసనసభ్యుల బలం కాంగ్రెసుకు ఉండడంతో పాటు మరో 22 మంది అదనంగా ఉన్నారు. అయితే, కాంగ్రెసు ముగ్గురు అభ్యర్థులనే రంగంలోకి దింపింది. ఈ 22 మది శాసనసభ్యులు కేశవరావుకు ఓటేసేలా తెరాసకు, కాంగ్రెసుకు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని కూడా అంటున్నారు. అయితే, ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉండడంతో సీమాంధ్ర శాసనసభ్యులు కేశవరావును ఓడించడానికి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి, రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఉపసంహరణ వరకు ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఆరు స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు రంగంలో వుండటంతో అధి కారిక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులలో గుబులు మొదలైంది. ఏ అభ్యర్థి ఓడిపోతారోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీలుండగా తొమ్మిది మంది సభ్యులు నామినేషన్లను దాఖలు చేశారు. జాజుల బాస్కర్‌ అనే వ్యక్తి నామినేషన్‌ను తిరస్కరించారు.

కేశవరావుకు నిరాశ

కేశవరావుకు నిరాశ

కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థులు ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారని వార్తలు రావడంతో ఎన్నికైనట్లు ఇచ్చే పత్రాన్ని తీసుకోవడానికి కె. కేశవరావు శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు. అయితే, ఆయనకు నిరాశే ఎదురైంది.

శ్రీధర్ బాబు ఇలా..

శ్రీధర్ బాబు ఇలా..

తెలంగాణకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అనిల్ ఇలా శాసనసభ ఆవరణలో కనిపించారు.

చైతన్యరాజు ఉపసంహరణ

చైతన్యరాజు ఉపసంహరణ

సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన చైతన్యరాజు చివరకు కాంగ్రెసు నాయకుల బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. ఆయన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

ఆదాల ప్రభాకర్ రెడ్డి ట్విస్ట్

ఆదాల ప్రభాకర్ రెడ్డి ట్విస్ట్

తాను నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం లేదని, తాను పోటీలో ఉన్నానని శాసనసభకు వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.

ఖాన్‌తో కేశవరావు ఇలా..

ఖాన్‌తో కేశవరావు ఇలా..

కాంగ్రెసు రాజ్యసభ అధికారిక అభ్యర్థి ఖాన్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కె. కేశవరావు ఇలా..

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చైతన్యరాజు, ఆదాల ప్రభాక ర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేసేంత వరకూ తొలుత ఉత్కం ఠ కొనసాగింది. నామినేషన్ల గడువు మరో 15 నిమిషా లుండగా రెబల్స్‌ తమ నామినేషన్లను వేసి సంచలనం సృ ష్టించారు. సాయంత్రం 3.30గంటలకు చైతన్యరాజు ఒక్కరే తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో రాజ్యసభ ఎన్నికల బరిలో 7 మంది అభ్యర్థులు న్నట్లు రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. ఫలితంగా కాం గ్రెస్‌ అధిష్ఠానానికి గుబులు ప్రారంభమైంది.

కాంగ్రెసు అధికారిక అభ్యర్థులు ముగ్గురిలో ఎంఏ ఖాన్‌ తప్ప మిగిలిన ఇద్దరు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే. సీమాంధ్ర నుంచి సమైక్యవాద నినాదంతో ఆదాల ప్రబాకర్ రెడ్డి రంగంలోకి దిగినందున కెవిపికి గానీ సుబ్బిరామిరెడ్డికి గానీ ముప్పు ఉండవచ్చుననే వాదన కూడా ఉంది. అయితే, ఖాన్‌ను బలిపశువును చేస్తారా, కేశవరావును ఓడిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

రాజ్యసభ ఎన్నికల్లో అధిష్ఠా నం ప్రకటించిన అభ్యర్థులకు పోటీగా రెబల్‌ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అధిష్ఠా నానికి నివేదికను పంపించారు. నేడో, రేపో పార్టీ నుంచి సస్పెన్షన్‌ వేటువేసే అవకాశముందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

English summary
The rebel Congress candidate Adala Prabhakar Reddy has given a twist to Rajyasabha election with not withdrawing nomination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X