ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మండపేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన సెగ్మెంట్ మండపేట. 2009 లో ఆలమూరు నియో జకవర్గం రద్దు అయింది. పర్ముఖ నేత సంగీత వెంకటరెడ్డి రెండు సార్లు గెలిస్తే, అంతకుముందు ఉన్న పామర్రు నియెజక వర్గంలో మరోసారి గెలిచారు. పామర్రులో పట్టాభిరామారావు మూడు సార్లు శాసనసభకు ఎన్నికైతే, మూడు సార్లు రాజమం డ్రి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన సోదరుడు సత్యనారాయణ రావు 1999 లో రాజమండ్రి నుండి లోక్‌సభ కు ఎన్నికై వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇక, 2009 లో ఈ నియోకవర్గంలో టిడిపి అభ్యర్ది విజయం సాధించ గా, ప్రజారాజ్యం అభ్యర్ది రెండో స్థానంలో నిలిచారు.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
పామర్రు లో అయిదు సార్లు ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ నాలుగు సార్లు గెలవగా, స్వతంత్ర అభ్యర్ది ఒకసారి గెలు పొందారు. ఇక, ఆలమూరు లో ఏడు సార్లు ఎన్నికలు జరిగితే అందులో మూడు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టిడిపి అభ్య ర్దులు గెలిచారు. మండపేట లో రెండు సార్లు టిడిపి అభ్యర్దే విజయం సాధించారు. 2014 ఎన్నికల ముందు ఒకసారి కడి యం నుండి ఎమ్మెల్యేగా, 1999 లో రాజమండ్రి ఎంపీగా గెలిచి వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన వెంకట స్వామి నాయుడు వైసిపి లో చేరారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 170880 ఓట్లు ఉన్నాయి. టిడిపి నుండి పోటీ చేసిన జోగేశ్వర రావు కు 100113 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన వెంకట స్వామి నాయుడుకు 64099 ఓట్లు దక్కాయి. టిడిపి అభ్యర్ది జోగేశ్వర రావు 36014 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications