ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఉంగుటూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా భీమడోలు, నిడమర్రు మండలాలను పూర్తిగా ఉంగుటూరు సెగ్మెంట్ లో కలి పారు. గణపవరం మండలం పూర్తిగా ఇందులో చేరింది. సీనియర్ కాంగ్రెస్ నేత వట్టి వసంతకుమార్ ఇక్కడి నుండి రెం డు సార్లు గెలిచి మంత్రి అయ్యారు. ఆయన వైయస్, రోశయ్య, కిరణ్ వద్ద మంత్రిగా పని చేసారు. ఆయన పై పోటీ చేసిన మాజీ మంత్రి కోటగిరి విధ్యాధర రావు గతంలో చింతలపూడి లో అయిదు సార్లు గెలిచారు. 2009 లో ఆ నియోజకవర్గం రిజ ర్వ్ కావటంతొ ఇక్కడ నుండి పోటీ చేసారు. జిల్లాలో అధికంగా ఆరు సార్లు గెలిచి రికార్డు సాధించిన వరప్రసాద మూర్తి రా జు ఇక్కడ రెండు సార్లు, తాడేపల్లి గూడెం, పెంటపాడు లో మరో నాలుగు సార్లు విజయం సాధించారు. 1952 లో అలంపు రం నుండి గెలిచిన సూర్యచంద్రరావు, వసంత కుమార్ బంధువులు. ఇక, 2009 ఎన్నికల్లో ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత ఇక్కడి సమీకరణాల్లో మార్పు కనిపించింది.
11 సార్లు ఎన్నికలు జరిగితే..
ఉంగుటూరు లో 11 సార్లు ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి అయిదు సార్లు గెలిచాయి. 2009 ఎన్నిక ల్లో టిడిపి నుండి తొలుత ఎంపికైన ఆంజనేయుడు నామినేషన్ చెల్లకపోవటంతో ఆయన భార్య లక్ష్మీకాంతమ్మ టిడిపి అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది వట్టి వసంతకుమార్ గెలుపొందారు. అప్పటి వరకు టిడిపిలో ఉన్న మాజీ మంత్రి కోటగిరి విధ్యాధర రావు ప్రజారాజ్యం లో చేరి పోటీ చేసారు. అయితే, వైయస్ మరణం తరువాత ఇక్కడ రాజ కీయంగా సమీకరణాల్లో మార్పు వచ్చింది.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తంగా 187816 ఓట్లు ఉంటే, అందులో161465 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి గన్ని వీరాంజ నేయులు కు 82118 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన పి శ్రీనివాస రావుకు 73188 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి పోటీ చేసిన వీరాంజనే యులుకు 8930 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2009 ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణకు గురి కావటంతో పోటీ లో లేకుండా పోయిన వీరాంజనేయులు 2014 లో టిక్కెట్ సాధించి గెలుపొందారు.












Click it and Unblock the Notifications