వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోస్తీ: అక్బర్‌ను కౌగిలించుకున్న నాయిని (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు రాజకీయ వ్యూహాలను పదునెక్కిస్తున్నారు. ఓ వైపు, టిడిపి, కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆకర్షిస్తూ మరోవైపు మజ్లిస్ పార్టీకి స్వేహహస్తం చాటారు.

మంత్రివర్గంలో చేరి, తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతూ కెసిఆర్ ఆదేశాల మేరకు తెరాస ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి తదితరులు మజ్లిస్ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లను వారి నివాసంలో సోమవారం కలిశారు.

ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఎంఐఎం నేత అసదుద్దీన్, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మధ్య మరో సమావేశం జరుగుతుందని కెటిఆర్ వెల్లడించారు. అందరినీ కలుపుకొని పోవాలని తెరాస భావిస్తోందని, కలిసి కృషి చేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధితోపాటు ముస్లిం, క్రైస్తవులు అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వానికి సహకరించాలని అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లను కోరినట్టు కెటిఆర్ చెప్పారు.

తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

అసదుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వంలో చేరడంకంటే తెలంగాణ అభివృద్ధి తమకు ముఖ్యమన్నారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో ప్రభుత్వానికి మజ్లిస్ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

హైదరాబాద్‌లో పెట్టుబడులు ఆకర్షించే విధంగా పాలన ఉండాలని కోరినట్టు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ తక్కువైతే మజ్లిస్ మద్దతు తీసుకోవాలని ఎన్నికలకు ముందే తెరాస నాయకత్వం నిర్ణయించుకుంది. ఈ దిశగా ప్రయత్నాలూ సాగాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ తెరాసకు లభించింది. అయినప్పటికీ మజ్లిస్ మద్దతు కోరడం ద్వారా ముస్లింలలో పార్టీ అనుకూల సందేశం పంపే విధంగా తెరాస ఎమ్మెల్యేల బృందం ఎంఐఎం నేతలను కలిసింది.

 తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉంది. కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం, బిజెపి, టిడిపి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తెరాస నాయకత్వం ముస్లింల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. తెరాస అధికారంలోకి వస్తే ముస్లింను డిప్యూటీ ముఖ్యమంత్రి చేయనున్నట్టు చంద్రశేఖర్ రావు గతంలోనే ప్రకటించారు.

తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

తెలంగాణలో తెరాస నేతృత్వంలో ఏర్పడనున్న ప్రభుత్వానికి సహకరిస్తామని, తెరాసకు మద్దతు ఇస్తామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

అక్బరుద్దీన్ నివాసంలో సోమవారం అసద్, అక్బర్‌లతో నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్, కెటిఆర్, పద్మారావు చర్చలు జరిపారు.

తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కెసిఆర్‌తో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల బృందం భేటీ కావాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి కెసిఆర్ గవర్నర్‌తో భేటీ కావాల్సి ఉంది.

తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

దీంతో, అదే సమయంలో, మజ్లిస్ నాయకులు రాకుండా తెరాస ప్రతినిధుల బృందమే నేరుగా అక్బర్ ఇంటికి వెళ్లి వారితో భేటీ అయింది. తొలుత అక్బరుద్దీన్ హత్య కుట్రపై తెరాస బృందం విచారం వ్యక్తం చేసింది.

 తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

తెలంగాణలో లౌకికవాదాన్ని బలోపేతం చేసి, మత సామరస్యం కాపాడుతామని నాయిని, కెటిఆర్ భరోసా ఇచ్చారు. దాంతో, తెరాసకు మద్దతివ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని, ఆ పార్టీతో సఖ్యత కొనసాగిస్తామని చెప్పారు.

తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, భేటీలో చాలా విషయాలపై చర్చించామని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, దాంతో పాటే నగరం కూడా అభివృద్ధి చెందాలని, పెట్టుబడులు రావాలని, నీళ్లు, కరెంట్ సమస్యలు, మైనార్టీల అభివృద్ధిపై కూడా చర్చించామని అసద్ తెలిపారు.

 తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

తాము ప్రభుత్వంలో చేరడం కీలకం కాదని, తెలంగాణలో లౌకికవాదం బలపడాలని, మత సామరస్యం కొనసాగాలని, దేశంలోనే తెలంగాణ మంచి రాష్ట్రం కావాలని అసద్ ఆకాంక్షించారు.

 తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

అక్బరుద్దీన్‌పై కుట్ర విషయమై మాట్లాడుతూ ఈ కేసులో వెనకున్న వారెవరో పోలీసులు గుర్తించాలని, అక్బరుద్దీన్‌కు భద్రత పెంచాలని, ఇదే విషయంపై నగర పోలీసు కమిషనర్‌ను కూడా కలిశామని చెప్పారు.

బిజెపి, ఆర్ఎస్ఎస్ విషయంలో తమ విధానం మారదని, నరేంద్ర మోడీకి టీఆర్ఎస్ సమదూరంలో ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు.

తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

తెలంగాణ ప్రజలకు మామీద కోటి ఆశలున్నాయని, వాటన్నిటినీ నెరవేర్చాలని, తమతో కలిసి రావాలని మజ్లిస్‌ను కోరామని, వచ్చే ఐదేళ్లు క్లిష్టమైనదని, తెలంగాణలో హైదరాబాద్ కీలకమని, ఈ ఐదేళ్లు సహకారం అందించాలని మజ్లిస్‌ను కోరామని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

తెరాస, మజ్లిస్

తెరాస, మజ్లిస్

మైనార్టీల అభివృద్ధికి తెరాస కట్టుబడి ఉందని, సచార్ నివేదిక అమలు, పాతబస్తీ అభివృద్ధిపై చర్చించామని తెలిపారు. మరోమారు కెసిఆర్‌తో మజ్లిస్ చర్చలుంటాయని తెలిపారు.

English summary

 MIM supremo Asaduddin Owaisi promised his party’s full support to the TRS government for the development of Telangana and Hyderabad city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X