వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డబుల్‌'పై మోడీ కన్ను: బాబు, జయలపై ఆశలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అవినీతి, కుంభకోణాలు, ధరల పెరుగుదల వంటి అంశాలతో యూపిఏ ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తాము కచ్చితమైన మెజార్టీ సీట్లు సాధిస్తామని భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇటీవలె ఎన్నికైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా మెజార్టీకి కావాల్సిన సీట్లు సాధిస్తామని చెబుతున్నప్పటికీ.. బిజెపి స్వతంత్రంగా రెండు వందల సీట్లు సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారట.

ఈ మేరకు ఆయన చాలా రోజుల నుంచే ఈ లక్ష్యసాధన దిశగా వ్యూహరచన చేస్తున్నారట. గత లోక్‌సభలో 116 సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి కనీసం 200 సీట్లు సాధించడం పెద్ద కష్టం కాదని, అయితే ఏ రాష్ట్రానికి తగినట్లుగా ఆ రాష్ట్రానికి వ్యూహాలు రూపొందించుకోవాలని మోడీ ఇటీవల జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బిజెపి నేతలకు స్పష్టం చేశారట. గత ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలపై మోదీ ఇప్పటికే దృష్టి సారించారు.

narendra modi, chandrababu naidu and jayalalithaa

హర్యానాలో కూడా ఈసారి ఖాతా తెరవాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. హర్యానాలో ఆదివారం ఆయన మాజీ సైనికాధిరుల ర్యాలీలో ప్రసగించారు. మోడీ ప్రధానంగా ఉత్తరాది పైన ఆశ పెట్టుకున్నప్పటికీ దక్షిణాధిన కూడా సొంత సీట్లు గెలుచుకోవడంతో పాటు పొత్తులపై యోచిస్తున్నారు. ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర నేతలు ప్రత్యేకంగా వ్యూహాలు రచించుకుంటున్నారు.

గత ఎన్నికల్లో యూపిలో 10 సీట్లు గెలిచిన బిజెపి, ఈసారి ఆ సంఖ్య 40 నుంచి 45 ఉంటుందని లెక్కలు వేసుకుంటోంది. ఇక రాజస్థాన్‌లోని పాతిక సీట్లలో కనీసం 15 నుంచి 20 సీట్లు, మధ్యప్రదేశ్‌లోని ఇరవై సీట్ల వరకు గెలుచకుంటామని బిజెపి భావిస్తోంది. మోడీ ప్రధాని అవుతున్నారంటే గుజరాత్‌లో కూడా సీట్లు పెరుగుతున్నాయని ఇప్పుడున్న 17కు మరో ఆరేడు పెరిగే అవకాశముంది.

దక్షిణాదిపై కూడా ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. కర్ణాటకలోని 28 సీట్లలో గతంలో అత్యధికంగా 16 సీట్లు సాధించిన బిజెపి... ఈసారి ఆ సీట్లు తగ్గిపోకుండా కృషి చేయాలని భావిస్తోంది. పార్టీ నుంచి విడిపడిన యడ్యూరప్పను ఈ వ్యూహంలో భాగంగా తిరిగి పార్టీలోకి లాగేందుకు కృషి చేస్తోంది. అదే సమయంలో మోడీ కొత్త మిత్రపక్షాల అన్వేషణలో పడ్డారు. అన్నాడిఎంకె, అకాలీదళ్, శివసేన వంటి మిత్రపక్షాలతో పాటు బిజెడిని తమవైపునకు తిప్పుకొనేందుకు మోడీ తీవ్రయత్నాలు చేస్తున్నారు.

మన రాష్ట్రం విషయానికి వస్తే టిడిపికి స్నేహహస్తం చాస్తున్నారు. అటు తెలంగాణలోనూ, ఇటు సీమాంధ్రలోనూ తెలుగుదేశంతో స్నేహం ద్వారా సీట్లు సాధించవచ్చునని బిజెపి అంచనా వేస్తోంది. బిజెపి రెండు వందల స్థానాల్లో గెలిస్తేనే ఇతర పక్షాలు కలిసి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మతతత్వ ముద్ర ఉన్నందున కాంగ్రెసుతో జత కట్టేందుకు చూపించేంత ఆసక్తి పలు పార్టీలు బిజెపిపై చూపించే అవకాశం లేదు.

కాంగ్రెసు, బిజెపిలు దాదాపు సమానంగా సీట్లు గెలిస్తే కాంగ్రెసు వైపే పలు పార్టీలు మొగ్గు చూపుతాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలవడం ద్వారా ఇతర పార్టీలను ఆకర్షించాలని చూస్తున్నారు. ఇప్పటికే అకాలీదల్, శివసేన వంటి పార్టీలు ఎన్డీయేలో ఉన్నాయి. బిజెపి సొంతగా ఎక్కువ స్థానాల్లో గెలిస్తే జయలలిత, చంద్రబాబు అటు వైపు అడుగులు వేసే అవకాశం లేకపోలేదు. అదే బాటలో మరికొన్ని పార్టీలు నడుస్తాయి.

English summary
Gujarat CM Narendra Modi has formally been named Bharatiya Janata Party's Prime Ministerial candidate in the capital on Friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X