చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురంధేశ్వరి పేరుపై వెనకాడిన బాబు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పీలేరు ఎన్నికల ప్రచార సభలో తన వదిన, బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి పేరు చెప్పడానికి వెనకాడారు. గతంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్‌లతో కలిసి పాల్గొన్న ప్రచారం సభలో ఆయన పురంధేశ్వరి పేరును స్పష్టంగా పలికారు. ఆదివారంనాడు మాత్రం ఆమె పేరు చెప్పకుండా, బిజెపి అభ్యర్థి అంటూ చెప్పి వదిలేశారు.

ఆదివారం పీలేరు సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. జైసమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్ కిరణ్ కమార్ రెడ్డిపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మంచి రోజులు గడిచిపోయాయని ఆయన అన్నారు.

వైయస్ జగన్ లక్ష కోట్ల మేరకు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని, త్వరలోనే జగన్ జైలుకు వెళ్తాడని, పాతికేళ్ల పాటు జైలులోని మగ్గుతాడని చంద్రబాబు అన్నారు. టిడిపి అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్ పేరు చెప్పిన చంద్రబాబు పురంధేశ్వరి పేరు మాత్రం చెప్పలేదు. దగ్గుబాటి పురంధేశ్వరి కడప జిల్లా రాజంపేట లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

చంద్రబాబు ఇలా..

చంద్రబాబు ఇలా..

ఆదివారం ఎన్నికల ప్రచార సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

పీలేరు సభలో చంద్రబాబు

పీలేరు సభలో చంద్రబాబు

జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి ఎన్ కిశోర్ కుమార్ రెడ్డి ఎర్రచందనం స్మిగ్లింగ్‌లో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

ప్రజలకు హామీలు..

ప్రజలకు హామీలు..

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు పీలేరు సభలో వివరించారు.

పీలేరు సభలో చంద్రబాబు ఇలా..

పీలేరు సభలో చంద్రబాబు ఇలా..

టిడిపి అభ్యర్థి పేరు చెప్పిన చంద్రబాబు నాయుడు బిజెపి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి పేరు మాత్రం చంద్రబాబు చెప్పలేదు.

English summary
Telugu Desam chief N. Chandrababu Naidu did not even say the name of his sister-in-law Purandeswari and preferred to call her the “BJP candidate” from Rajampet LS constituency, during his campaign at Piler on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X