వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలలో ఏం జరుగుతోంది: జగన్‌కు ఢిల్లీ మద్దతు ఉందా?

నంద్యాల ఉప ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో బిజెపి వైసిపి అధినేత జగన్ వైపు ఉందా? అనే చర్చ సాగుతోంది. నంద్యాలలో టిడిపి వర్సెస్ వైసిపిగానే కనిపిస్తోంది. ఎక్కడా మిత్రపక్షం బిజెపి టిడిపికి మద్దతిస్

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో బిజెపి వైసిపి అధినేత జగన్ వైపు ఉందా? అనే చర్చ సాగుతోంది. నంద్యాలలో టిడిపి వర్సెస్ వైసిపిగానే కనిపిస్తోంది. ఎక్కడా మిత్రపక్షం బిజెపి టిడిపికి మద్దతిస్తున్న దాఖలాలు లేవు.

నంద్యాల ఉప ఎన్నికల వేళ, వైసిపికి షాక్నంద్యాల ఉప ఎన్నికల వేళ, వైసిపికి షాక్

చంద్రబాబు ప్యాంటీ వాహనంలోనే తనిఖీలు

చంద్రబాబు ప్యాంటీ వాహనంలోనే తనిఖీలు

దీంతో పాటు నంద్యాలలో జరుగుతున్న పరిణామాలు కూడా జగన్‌కు ఢిల్లీ మద్దతు ఉన్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసిపి ఫిర్యాదుతో ఏకంగా సీఎం చంద్రబాబు ప్యాంటీ వాహనంలోనే తనిఖీలు నిర్వహించారు. దీనిపై స్వయంగా చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేతలు తనకు ఆహారం తీసుకు వచ్చే వాహనంపై కూడా ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.

వైసిపి విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా

వైసిపి విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా, ఫిర్యాదులు చేస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారి భన్వర్ లాల్ వైసిపి ఏజెంటుగా పని చేస్తున్నారని, టిడిపిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు.

అక్కడే అనుమానాలు

అక్కడే అనుమానాలు

వైసిపి డబ్బుల పంపకంపై నిర్లక్ష్యం, ఏకంగా చంద్రబాబు ప్యాంటీ వాహనం తనిఖీలను బట్టి చూస్తుంటే జగన్‌కు ఢిల్లీ మద్దతు ఉన్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలోను టిడిపి భన్వర్ లాల్‌పై ఫిర్యాదులు చేసింది.

ఇద్దరిపై కాంగ్రెస్ ఫిర్యాదు

ఇద్దరిపై కాంగ్రెస్ ఫిర్యాదు

ఇదిలా ఉండగా, నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి, వైసిపిలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నంద్యాలలో మకాం వేసిన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు హేమాన్ష్‌ను ఉదయం కలిసిన కాంగ్రెస్ నేతలు డబ్బు పంపిణీపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులూ పోటాపోటీగా డబ్బులను పంచుతున్నారని, ఈసీ తరఫున చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Telugu Desam Party alleges massive partiality by State Chief Election Commissioner, Bhanvarlal towards YSR Congress in the ongoing Nandhyal by-election. TDP alleges that Bhanvarlal is acting like a YSR Congress agent and is troubling TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X