అధిష్టానంపై కిరణ్ ఆగ్రహ హావభావాలు (పిక్చర్స్)

హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమయంలో ఆయన విభజన అంశంపై అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు ఎన్నికలకు ముడి పెట్టవద్దని, రాజకీయం కోసం విభజన చేయవద్దని సూచించారు.

ఎన్నికల సమయంలో కావాలంటే ఏ పార్టీతోనైనా కలువవచ్చునని, లాభం పొందవచ్చునని చెప్పారు. అధిష్టానానికి తాను చెప్పిన దాంట్లో 25 శాతమే బయటకు వెల్లడించానని, సమైక్య రాష్ట్రానికి 17, 18వ ముఖ్యమంత్రులు కూడా వస్తారన్నారు. విభజనతో ప్రభుత్వాలపై పెనుభారం పడనుందన్నారు. తనకు ఎలాంటి స్వార్థం లేదని, వాదనలో తిరకాసు లేదన్నారు.

పొత్తులు అధిష్టానం ఇష్టమని కానీ, విభజనకైతే అంగీకరించేది లేదన్నారు. రాష్ట్రం వేరు, రాజకీయం వేరన్నారు. విభజనతో తెలంగాణ రైతుకే ఎక్కువ నష్టమన్నారు. మిగిలు జలాలపై తెలంగాణ ప్రాంతం హక్కు కోల్పోతుందని హెచ్చరించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు కిరణ్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.

కిరణ్ 1

కిరణ్ 1

కిరణ్ 1

విభజన విషయంలో తన వైఖరిని నేరుగా ఢిల్లీ పెద్దలకు చెప్పానని, రాజకీయంగా ఒకసారి ఎన్నికల్లో ఓడిపోవచ్చునని, మళ్లీ ఎన్నికల్లో గెలవచ్చునని కిరణ్ అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా అంగీకరిస్తామని, విభజనకు మాత్రం అంగీకరించేది లేదని అధిష్టానానికి చెప్పానన్నారు. మీడియా సమావేశాల్లో, బహిరంగ సభల్లో చెబుతున్నది కేవలం పావు శాతమేనని, ఇంతకు మూడింతలు తమ పార్టీ నేతలకు చెప్పానని, రాష్ట్రం వేరు.. రాజకీయం వేరు.. తొలి నుంచి సమైక్యవాదినైన తనకు పార్టీయా, రాష్ట్ర సమైక్యమా అంటే ఏదో ఒకటి తేల్చుకునే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానన్నారు.

కిరణ్ 2

కిరణ్ 2


క్రికెట్‌లో బంతి వేశాక దానిని బట్టి బ్యాట్స్‌మన్ స్పందించాలని, బాల్ వేయకముందే ఫోరో, సిక్సో కొట్టాలనుకుంటే ఔట్ అయిపోతాడని, శాసనసభకు విభజన ముసాయిదా బిల్లు ఎప్పుడు వస్తుందో తనకు తెలియదని, అది వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. దానిపై రాష్ట్రపతి చెప్పాక వ్యూహాలు ఉంటాయన్నారు.

కిరణ్ 3

కిరణ్ 3

సిడబ్ల్యూసి నిర్ణయంపై తనకు స్పష్టత ఉందని కానీ, విభజన వల్ల రాష్ట్రంలోని ఇరుప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రం, దేశం శాశ్వతమని, రాజకీయాలు శాశ్వతం కాదన్నారు. సిఎంగా రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాన్ని వివరించాల్సిన అవసరం ఉందన్నారు. తన తర్వాత వందమంది సిఎంలు వచ్చినా విభజన జరుగుతుందంటే చూస్తూ ఊరుకోరని చెప్పారు.

కిరణ్ 4

కిరణ్ 4

విభజన వల్ల తెలంగాణ రైతులకే నష్టం వాటిల్లుతుందని, విభజన జరిగితే నీటి మళ్లింపు ఉండదన్నారు. హైదరాబాద్‌కు తాగునీటి సమస్యలు వస్తాయన్నారు. కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్షకు దిగలేదని, 14 ఎఫ్‌ను రద్దు చేయాలని దీక్షకు దిగారన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక 14-ఎఫ్ రద్దు చేశామని, అసెంబ్లీని ప్రొరోగ్ చేయడమనేది సాంకేతిక సమస్య అని చెప్పారు.

కిరణ్ 5

కిరణ్ 5

తాను రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిని అని, 17వ, 18వ ముఖ్యమంత్రులు కూడా వస్తారని, చిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావడం గర్వకారణంగా ఉందన్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+