నాడు జయ చేయి పట్టి లాగారు, నేడు మోకరిల్లుతున్నారు!
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఎగ్టిజ్ పోల్ అంచనాలు లెక్క తప్పాయి. డిఎంకే అధికారంలోకి వస్తారని, కరుణానిధి ముఖ్యమంత్రి అవుతారని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి.
కానీ ఊహించని విధంగా జయలలిత మరోసారి అధికారం పీఠం ఎక్కి.. వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకున్న ముఖ్యమంత్రిగా 34 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించారు. కరుణానిధి ఆశలు అడియాసలయ్యాయి. జయ గెలుపుకు, కరుణ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
జయ పథకాలు, విపక్షాలు.. డీఎండీకే, డీఎంకేలు కలిసి పోటీ చేయకపోవడం, డీఎంకేలో అన్నదమ్ముల పోరు, చెన్నై వరదలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల జయలలిత గెలిచారు. కరుణానిధి ఓటమి చవి చూశారు. జయ గెలుపు నేపథ్యంలో అన్నాడీంకే కార్యకర్తలు డ్యాన్సులు చేసి సందడి చేశారు.

జయలలిత గెలుపు
జయలలిత గెలుపుకు ఆమె ప్రవేశ పెట్టిన పథకాలు ప్రధానం కారణంగా నిలుస్తున్నాయి. అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు ఇస్తామని చెప్పారు. వాటికి రూ.1,100 కోట్లు ఖర్చు కానుంది. మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తామని చెప్పారు. వాటికి రూ.1.85 కోట్లు ఖర్చు కానుంది.

జయలలిత గెలుపు
జయను మొదటి నుంచీ ఆమె చుట్టూ ఉన్నవారు చాలా తక్కువగా అంచనా వేశారని అంటున్నారు. ఎంజీఆర్ అండ లేకుంటే ఆమె పని అంతే అన్న వారు ఉన్నారు.

జయలలిత గెలుపు
1987లో ఎంజీఆర్ మరణించినప్పుడు.. ఆమె పని ముగిసిందని చాలామంది భావించారు. ఆమెను దుర్భాషాలాడిన వారు కూడా ఉన్నారు. ఎంజీఆర్ శవయాత్రలో ఆమెను వాహనంమీద నుంచి చేయిపట్టుకుని ఈడ్చి పారేసిన సందర్భం కూడా ఉంది.

జయలలిత గెలుపు
కానీ, అదే ఎంజీఆర్ వారసురాలిగా ఆమె రికార్డులు సృష్టించారు. 1989లో కరుణానిధి గెలిచారు. ఇక జయలలిత అన్నాడీఎంకేను నడపలేరని అనుకున్నారు. ఆ సమయంలో ఆమెకు తీవ్ర పరాభవం జరిగింది.

జయలలిత గెలుపు
కానీ ఆ తర్వాత ఎన్నికల్లో జయలలిత విజయం సాధించారు. నిండు సభలో తన చీర పట్టుకొని గుంజిన వారిని తప్పించాలని, లేదంటే తాను అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేశారు.

జయలలిత గెలుపు
1991లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌పై ఒత్తిడి తెచ్చి మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా చేశారు. అప్పుడు విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో కరుణానిధి గెలిచారు. జయలలిత పైన ఎన్నో కేసులు పెట్టారు. ఆమె జైలుకు కూడా వెళ్లారు.

జయలలిత గెలుపు
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జయ.. కూడా ప్రతీకారం తీర్చుకున్నారు. వృద్ధుడైన కరుణను అర్ధరాత్రి అరెస్టు చేయించి జైల్లో పెట్టించారు. ఆమె భయాన్ని పక్కన పెట్టారు. ఎవరికీ బెదరలేదు.

జయలలిత గెలుపు
గతంలో ప్రధానమంత్రి హోదాలో వాజ్‌పేయి చెన్నైని సందర్శించినప్పుడు రెండుసార్లు ఆమె ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. చెన్నై విమానాశ్రయంలో అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ రెండో ఫేజ్‌ను వాజ్‌పేయి ప్రారంభించే సందర్భంలోనూ ఆమె హాజరు కాలేదు. దానిని అందరూ ప్రశ్నించారు. తనకు ప్రధాని పక్కనే సీటు కేటాయిస్తే బాగుండేదని, వేదిక మీద ఒక కార్నర్ సీటు ఇచ్చి కూర్చోమంటే కూర్చోలేనని స్పష్టం చేశారు. జయలలిత ఏదైనా ముక్కుసూటిగా చెప్పే రకమని అంటుంటారు.

జయలలిత గెలుపు
కష్టాన్ని చూసి కరిగిపోయే హృదయం జయలలితది అంటారు. ఆర్థిక కష్టాలను చూస్తే అమ్మ వారికి ఉద్యోగం లేదా ఇతరత్రా ఆసర కల్పిస్తుంటారని అంటారు. అభిమానులు ఆమె కాళ్లకు పాదాభివందనం చేశారు. విమర్శలు వచ్చినా ఇవి మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు.












Click it and Unblock the Notifications