హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘర్షణ వద్దు.. మోడీతో మాట్లాడ్తా, ఏపీతో..: కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రంతో ఘర్షణ వాతావరణం వద్దని, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేద్దామని, సహేతుక పద్ధతుల్లో సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్దామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ ఎంపీలకు గురువారం సూచించారు. శాసన సభ సమావేశాల తర్వాత తాను ఢిల్లీకి వస్తానని చెప్పారు. కేంద్రంతో స్నేహ పూర్వక వైఖరి అవలంబిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుందామని సూచించారు.

ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రి ఎంపీలతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం 28 ప్రధాన అంశాలను గుర్తించి, ఎంపిలకు వాటికి సంబంధించిన వివరాలు అందజేశారు. కేంద్రం ఆంధ్ర పట్ల కొంత సానుకూల వైఖరి అవలంబిస్తున్నా, కేంద్రంతో దీర్ఘకాలం ఘర్షణ పడలేమని, దాని వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు, మంత్రులు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.

కేసీఆర్

కేసీఆర్

కేంద్రంతో ఘర్షణ వాతావరణం వద్దని, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేద్దామని, సహేతుక పద్ధతుల్లో సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్దామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ ఎంపీలకు గురువారం సూచించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంటు సమావేశాల సందర్భంగా డిసెంబర్‌లో తాను ఢిల్లీకి వస్తానని కేసీఆర్ అన్నారు. రెండు రోజులు ఢిల్లీలో ఉండి రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీని, మంత్రులను కలుస్తానని చెప్పారు.

ఘర్షణ వైఖరి అవసరం లేదని, అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుపట్టాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణకు సంబంధించిన కీలకమైన సమస్యలను పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని ఎంపీలకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ 54 శాతం విద్యుత్ వాటా ఇవ్వక పోవడం వల్ల తలెత్తిన సమస్యలు వివరించారు. ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదా కోసం కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు.

పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి, తెలంగాణకు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ప్రశ్నించాలని నిర్ణయించారు. హైకోర్టు విభజన, అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల విభజనలో జరుగుతున్న ఆలస్యాన్ని కేంద్రానికి వివరించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంటు సమావేశాల సందర్భంగా డిసెంబర్‌లో తాను ఢిల్లీకి వస్తానన్నారు. రెండు రోజులు ఢిల్లీలో ఉండి రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీని, మంత్రులను కలుస్తానని చెప్పారు.

English summary
K CHANDRASHEKAR RAO IS SEEN REVIEWING WITH THE MPS, MINISTERS, REGARDING THE ISSUES TO BE RAISED IN LOKSABA
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X