కెసిఆర్ ఆప్షన్: తర్వాత మోడీతో జత? (పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్నికల తర్వాత అవసరమైతే బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎతో జతకట్టే ప్రత్యామ్నాయం చేజారకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదని అంటున్నారు. కేంద్రంలో ఓ కూటమి అధికారంలోకి వస్తే ఆ కూటమితో జత కట్టడానికి వీలుగానే ఆయన తన వ్యూహాన్ని రచించుకున్నట్లు చెబుతున్నారు.
మారుతున్న రాజకీయ సమీకరణలు తెరాస అధినేత కెసిఆర్ వైఖరిలో మార్పునకు కారణంగా ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. సర్వే నివేదికల్లో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కాంగ్రెస్ కన్నా తెరాస మెరుగైనా ఫలితాలు సాధిస్తుందని తేలింది. దీంతో గులాబీ నేత ఒంటరి పోరకు సిద్దమయ్యారని తెలుస్తోంది. తెలంగాణలో తొమ్మిది పార్లమెంటు సీట్లు ఆ పార్టీకి వస్తాయని ఎన్‌డి టీవీ సర్వేలో తేలింది. దీంతో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంకు ఈ మెజార్టీ మద్దతుకు ఆ సంఖ్య ఉపయోగపడుతుందని కెసిఆర్ భావిస్తున్నారు.
వివిధ సంస్థల సర్వేలలో బిజెపి జాతీయ స్థాయిలో అతిపెద్ద పార్టీగా లోక్‌సభ ఎన్నికల్లో అవతరించనున్నదని, ఎన్‌డిఏ కూటమికే మెజార్టీ వస్తుందని తేలుతోంది. ఈ క్రమంలో తొమ్మిది ఎంపీ సీట్లు సాధించిన తమకు ఎన్‌డిఏ కూటమిలో చేరితో తగిన ప్రాధాన్యత ఉంటుందని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్‌డిఏ కూటమిలో భాగస్వామ్యమై కేంద్రం నుంచి తెలంగాణకు భారీగా నిధులు రప్పించగలిగితే, మున్ముందు తెలంగాణ ప్రాంతలో ముఖ్యమంత్రి సీటు సైతం కైవసం చేసుకోవచ్చన్న ఆలోచనలో గులాబీ నేత ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్లు సమాచారం.

టిడిపికి షాక్
తెలంగాణలో తెరాస అత్యధిక సీట్లు సాధిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్న క్రమంలో ఆ పార్టీలోకి టిడిపి నుంచి వలసలు పెరిగాయి. ఆదివారంనాడు టిడిపి శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ తెరాసలో చేరారు.

ఊపు మీద తెరాస.
తెలంగాణలో తెరాస ఊపు మీద ఉన్నట్లు కనిపిస్తోంది. మీడియా సమావేశంలో తెరాస శాసనసభ్యుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇలా..

తెలంగాణలో బాబుకు షాక్..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఒక్కో ఎమ్మెల్యే తెరాస గూటికి చేరుకుంటున్నాడు.

తెలంగాణలో టిడిపి అంతేనా...
తెలంగాణలో మొదటి నుంచీ తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చంద్రబాబునే లక్ష్యం చేసుకున్నారు. తెలంగాణలో కూడా తామే గెలుస్తామని మాత్రం చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాస్ గౌడ్ తెరాసలోకి...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాస గౌడ్ ఆదివారం తెరాసలో చేరారు.

రసమయి బాలికిషన్ తెరాసలోకి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తన ధూమ్‌ధామ్ ద్వారా కీలక పాత్ర పోషించిన రసమయి బాలకిషన్ ఆదివారంనాడు తెరాసలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications