వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసం: జగన్‌తో కలిసిపోయారా? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సొంత పార్టీ పార్లమెంటు సభ్యులే కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆరుగురు పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఆ వెంటనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా నోటీసు ఇచ్చింది. అయితే, తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ ధరల పెరుగుదల, అవినీతి అంశాలపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు.

కాంగ్రెసులోని ఆరుగురు పార్లమెంటు సభ్యులతో పాటు తెలుగుదేశం సీమాంధ్ర సభ్యులు, వైయస్సార్ కాగ్రెసు పార్టీ సభ్యులు తెలంగాణకు వ్యతిరేకంగా ఏకమయ్యారని, కుట్ర చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు విమర్శిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి తన మద్దతు ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చెప్పారు.

విభజనకు వ్యతిరేకంగా బలాలను కూడగట్టడంలో సీమాంధ్ర సభ్యులు బుధవారం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీని, రాష్ట్రానికి చెందిన బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడిని వారు కలిశారు. వారి ప్రయత్నాల్లో భాగంగా బిజూ జనతాదళ్, శివసేన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.

సబ్బం హరి గర్జన

సబ్బం హరి గర్జన

లోకసభ వాయిదా పడిన తర్వాత బుధవారం కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి సొంత కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా గర్జించారు. లోకసభను ప్రోరోగ్ చేయడానికి కాంగ్రెసు పార్టీ స్వపక్షాలతో కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.

సీమాంధ్ర ఎంపీలపై రాజయ్య ఫైర్

సీమాంధ్ర ఎంపీలపై రాజయ్య ఫైర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య తప్పు పట్టారు.

పొన్నం ప్రభాకర్ విమర్శలు..

పొన్నం ప్రభాకర్ విమర్శలు..

తెలంగాణను వ్యతిరేకించడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎంతకైనా దిగజారి వ్యవహరిస్తారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

ఎంపి వివేక్....

ఎంపి వివేక్....

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో తెలంగాణ పార్లమెంటు సభ్యులు రంగంలోకి దిగారు. సీమాంధ్ర ఎంపీల తీరును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎంపి సీమాంధ్ర ఎంపీలపై విమర్శలు గుప్పించారు.

టిడిపి ఎంపీల దాడి..

టిడిపి ఎంపీల దాడి..

కాంగ్రెసు తీరుపై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. లోకసభను ప్రోరోగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని ఎంపి నిమ్మల కిష్టప్ప విమర్శించారు.

నిమ్మల కిష్టప్ప విమర్శలు..

నిమ్మల కిష్టప్ప విమర్శలు..

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప తీవ్రంగా విమర్శలు చేశారు.

మోదుగుల ప్రయత్నాలు..

మోదుగుల ప్రయత్నాలు..

తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.

తెలంగాణ జెఎసి నేతలు..

తెలంగాణ జెఎసి నేతలు..

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని తెలంగాణ జెఎసి నేతలు కలిశారు.

డిగ్గీరాజాతో తెలంగాణ ఎంపీలు

డిగ్గీరాజాతో తెలంగాణ ఎంపీలు

సీమాంధ్ర ఎంపీలు తెలంగాణకు వ్యతిరేకంగా కార్యాచరణను పెంచడంతో తెలంగాణ ఎంపీలు జాగ్రత్త పడుతున్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పాటు తెలంగాణ ఎంపీలు కలిశారు.

జగన్ దూకుడు..

జగన్ దూకుడు..

తాము అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఢిల్లీలో చెప్పారు.

English summary
Delhi has witnessed the political heat with the notice served for no confidence motion against UPA government opposing the bifurcation of Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X