వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ: విభజనపై అటు జగన్, ఇటు టీ నేతలు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఢిల్లీ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఓ వైపు ప్రయత్నాలు సాగిస్తుంటే, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల ప్రయత్నాలు తిప్పికొట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికి శుక్రవారం ఢిల్లీలో ప్రకాష్ సింగ్ బాదల్‌ను కలిశారు. ఆ తర్వాత పాట్నా వెళ్లి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సహకరించాలని ఆయన ఆ నాయకులను కోరారు.

తెలంగాణ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై విమర్శలు కురిపించారు.

కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు

కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు.

టీడిపి సీమాంధ్ర ఎంపీలు..

టీడిపి సీమాంధ్ర ఎంపీలు..

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చి, మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాజ్‌నాథ్ సింగ్ కీలకమైన ప్రకటన..

రాజ్‌నాథ్ సింగ్ కీలకమైన ప్రకటన..

విభజన రాజకీయాలు వేడెక్కిన స్థితిలో బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కీలకమైన ప్రకటన చేశారు. తెలుగు మీడియాతో ఆయన శుక్రవారం సాయంత్రం మాట్లాడారు. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీదే అని ఆయన అన్నారు.

బాదల్‌తో వైయస్ జగన్..

బాదల్‌తో వైయస్ జగన్..

న్యూఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శుక్రవారంనాడు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌ను కలిశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

నితీష్ కుమార్‌తో జగన్..

నితీష్ కుమార్‌తో జగన్..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పాట్నా వెళ్లి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని ఆయన నితీష్ కుమార్‌ను కోరారు.

English summary
While YSR Congress party president YS Jagan trying to garner support for his united Andhra slogan, Congress Telangana MPs are trying counter him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X