జగన్ పోరు: పవన్ కళ్యాణ్‌తోనే అలజడి (పిక్చర్స్)
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాల్లో పర్యటించడం సంచలనం సృష్టించింది. రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీవ్రంగా మాట్లాడుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గానీ పెద్దగా పట్టించుకోలేదు. రాజధాని కోసం ప్రభుత్వం భూములు సేకరించే విధానాన్ని తప్పుపడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలను వారు రాజకీయంగానే తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
జగన్ పోరాటం చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ రంగం మీదికి వచ్చారు. రాజధాని ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలుసుకున్నారు. వారి అభిప్రాయాలను కనుకున్నారు. ఉండవల్లి, పెనుమాక, బేతంపూడి గ్రామాల రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ ఆయన కచ్చితమైన ఓ లెక్కను చూపించారు. దానివల్ల పవన్ కళ్యాణ్ మాటలకు విలువ వచ్చింది.

రైతులతో పవన్ కళ్యాణ్
ఎపి రాజధాని ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయన దాన్ని ఒక్క బాధ్యతగా చేపట్టారనే మాట వినిపిస్తోంది.

భరోసా ఇచ్చారు...
రాజధాని ప్రాంతాల రైతులకు పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భరోసా ఇచ్చినట్లు కనిపించారు. రైతులకు నష్టం జరిగితే ఎవరైనా అడుగుతాననే పద్ధతిలో ఆయన మాటలు ఉన్నాయి.

పోరాటం చేస్తా..
రైతుల భూములను బలవంతంగా తీసుకోవద్దని, అలా తీసుకుంటే తాను నిరాహార దీక్షకు దిగుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

చంద్రబాబును విమర్శిస్తూ...
రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై పవన్ కళ్యాణ్ తన పర్యటనలో విరుచుకుపడ్డారు.

పెనుమాక రైతుల ప్రశ్నలు..
రాజధాని ప్రాంతంలో పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు పెనుమాక గ్రామ ప్రజలు కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటిని ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించారు.

రైతులతో ఇలా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించి, భూసేకరణ విధానంపై విమర్శలు గుప్పించారు. రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

రైతులతో ముఖాముఖి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పెనుమాక, బేతంపూడి, ఉండవల్లి గ్రామ రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు.

కలిసిపోయి ఇలా..
పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు రైతులతో, ప్రజలతో కలిసి మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

పవన్ నిలబడుతారా...
పవన్ కళ్యాణ్ తమ వెంట ఉంటారనే విశ్వాసం ప్రజలకు కలిగిందా అనేది చూడాల్సిందే. వారు ఆయనకు తమ బాధలను చెప్పుకున్నారు.
ఆయన ప్రజల్లో కలిపిపోయి మాట్లాడారు. భోజనం కూడా అక్కడే చేశారు. అసలు పరిస్థితి ఏమిటని తెలుసుకోవడానికి ఆయన పర్యటన చేసినట్లు కనిపిస్తోందే గానీ భూసేకరణ విధానాన్ని వ్యతిరేకించాలనే ముందస్తు నిర్ణయంతో వెళ్లినట్లు కనిపించడం లేదు. దానివల్ల కూడా ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పైగా, అటు బిజెపిని, ఇటు టిడిపిని సమర్థించడం వల్ల ఆ రెండు పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ మాటలను పట్టించుకోవాల్సిన అనివార్యతలో పడ్డాయి.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి విమర్శల కోసం విమర్శలు చేస్తారనే అభిప్రాయం స్థిరపడిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. రైతులు వచ్చి చెప్పారు కాబట్టి వారి కోసం మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన సమర్థించుకున్నారు. కాగా, ఆయన ఇప్పటికిప్పుడు ఆశించే రాజకీయ ప్రయోజనాలు కూడా ఏమీ లేవు.












Click it and Unblock the Notifications