ఎన్టీఆర్ బొమ్మతో జయలలితకు తెలుగు వ్యక్తి సవాల్!

చెన్నై: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఐదువేల మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తమిళనాడులో 234 నియోజకవర్గాలున్నప్పటికీ 232 స్థానాల్లోనే పోలింగ్‌ జరుగుతోంది. అరవకురిచ్చి, తంజావూరులో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభపెడుతున్నారని ఆరోపణలు రావడంతో అక్కడ ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని ఆర్కే నగర్‌ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఈ స్థానం నుంచి అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ ఎన్నికల కోసం 52వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా, తమిళనాడులో దాదాపు వంద నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. పదుల నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు జరిగిన ప్రచారంలో తెలుగు ప్రముఖులను కూడా ఉపయోగించుకున్నారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ చిత్రాలతో ఉన్న మాస్క్‌లను ధరించి పలువురు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్కే నగర్, హోసూర్‌లలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు ఎన్టీఆర్ మాస్కులతో ప్రచారం నిర్వహించారు.

ప్రచారం

ప్రచారం

తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తదితర తెలుగు వారు ఆర్కే నగర్, హోసూరు.. ఇలా పలు నియోజకవర్గాల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

ప్రచారం

ప్రచారం

తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆర్కే నగర్, హోసూరు నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ మాస్కులతో తెలుగువారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ప్రచారం

ప్రచారం

తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆర్కే నగర్, హోసూరు నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్టీఆర్ మాస్కులతో ప్రచారం చేస్తూ.. తనను గెలిపిస్తే ఏం చేస్తానో చెబుతున్నారు.

ఆర్కే నగర్ నుంచి జయలలిత

ఆర్కే నగర్ నుంచి జయలలిత

కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైనే పోటీ చేస్తున్నారు. జయలలిత ఆర్కే నగర్ నుంచి బరిలో నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+