కార్తీ చిదంబరం: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు ఏమిటి?

Recommended Video

    CBI Arrests Karti Chidambaram : What is the INX Media Case

    చెన్నై: మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి తనయుడు కార్తీ చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సిబిఐ అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడులు నిబంధనలకు విరుద్దంగా వచ్చాయని సిబిఐ ఆరోపిస్తోంది. ఈ కేసు విషయమై పదేళ్ళ తర్వాత కార్తీ చిదంబరం వ్యవహరం ఉందని గుర్తించిన సిబిఐ ఆయనపై కేసును నమోదు చేసింది. సిబిఐ ఆరోపణలను కార్తీ చిదంబరం కొట్టిపారేస్తున్నారు.అసలు ఐఎన్ఎక్స్ మీడియా కేసు అంటే ఏమిటో ఓ సారి తెలుసుకొందాం.

    పీటర్, ఇంద్రనీ ముఖర్జీ యాజమాన్యంలోని ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ విదేశీ పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం మంజూరు చేయడంలో నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించి సీబీఐ పలు వరుస దాడులను జరుపుతోంది.

    ఇందులో భాగంగానే మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి కార్తీ చిదంబరానికి ఈ కేసులో లింకులున్నాయని గుర్తించిన సిబిఐ అధికారులు ఆయనను బుధవారం నాడు అరెస్ట్ చేశారు. కార్తీ చిదంబరానికి చెందిన సిఎను కూడ సోమవారం నాడు సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాదు అతడిని 14 రోజల పాటు జ్యూడిషీయల్ రిమాండ్‌కు తరలించారు.

    నిబంధనలకు విరుద్దంగా పెట్టుబడులు

    నిబంధనలకు విరుద్దంగా పెట్టుబడులు

    పీటర్, ఇంద్రాణీ ముఖర్జీ నేతృత్వంలోని ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడుల విషయంలో నిభంధనలను ఉల్లంఘించారని కేసులు నమోదయ్యాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి విదేశీ పెట్టుబడుల ప్రొమోషన్‌ బోర్డు(ఎఫ్‌ఐపీబీ) క్లియరెన్స్‌ కోసం 2007 సంవత్సరంలో కార్తీ చిదంబరం రూ.3.5 కోట్లు అక్రమంగా వసూలు చేశాడని, ఆ డబ్బులను తన కంపెనీలోకి అక్రమ మార్గంలో మళ్లించుకున్నాడని సీబీఐ 2017 మేలో కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది.

    పెట్టుబడుల విషయంలో కార్తీ పాత్రపై సిబిఐ ఆరోపణలు

    పెట్టుబడుల విషయంలో కార్తీ పాత్రపై సిబిఐ ఆరోపణలు

    విదేశీ పెట్టుబడులు ఐఎన్ఎక్స్ మీడియాలోకి రావడంపై కార్తీ కీలకంగా వ్యవహరించాడని సిబిఐ ఆరోపిస్తోంది. ఈ కేసు విషయమై దర్యాప్తు చేసిన సిబిఐ అదికారులు పదేళ్ళ తర్వాత కార్తీ పాత్రను గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కార్తి చిదంబరం తోసిపుచ్చారు. కానీ ఈ కేసులో ఇప్పటికే పలు దఫాలు సిబిఐ దాడులు నిర్వహించింది. ఈ దాడుల తర్వాత కార్తీ చిదంబరాన్ని సిబిఐ అధికారులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. విదేశాల నుండి నిధులు వచ్చేలా అధికారులను ప్రభావితం చేశారని సిబిఐ కార్తీ చిదంబరంపై ఆరోపణలు చేసింది

    నిధులిలా వచ్చాయి

    నిధులిలా వచ్చాయి

    ఎఎన్‌ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుండి పెట్టుబడులు వచ్చే విషయంలో నిభంధనలకు విరుద్దంగా అధికారులను ప్రభావితం చేశారని సిబిఐ ఆరోపిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న సంస్థ ధరఖాస్తు విషయమై అధికారులను కార్తీ చిదంబరం ప్రభావితం చేశారని సిబిఐ అభిప్రాయపడింది.దీంతో ఆ సంస్థకు విదేశాల నుండి రూ 305 కోట్ల నిధులు వచ్చాయని సిబిఐ గుర్తించింది.

    ఆ సంస్థ కార్తీదేనా

    ఆ సంస్థ కార్తీదేనా

    కార్తీ చిదంబరం సుమారు రూ10 లక్షలను ఐఎన్ఎక్స్ సంస్థ యాజమాన్యం ద్వారా కన్సల్టింగ్ పీజు కింద తీసుకొన్నాడని సిబిఐ గుర్తించింది. అడ్వాంటేజీ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఈ పీజును తీసుకొన్నట్టుగా సిబిఐ ఆరోపిస్తోంది. ఈ సంస్థను పరోక్షంగా కార్తీ నిర్వహిస్తున్నారని సిబిఐ అభిప్రాయపడింది.దీంతో ఈ కేసుల్లో సిబిఐ పలు మార్లు కార్తీ చిదంబరానికి చెందిన సంస్థలపై దాడులు నిర్వహించింది. సోదాలు చేసింది. చివరికి బుధవారం నాడు అరెస్ట్ చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+