ట్రంప్ మంకు పట్టు: మెక్సికో గోడకు తడిసి మోపెడు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విదేశాల నుంచి వలస కార్మికుల రాకను నిరోధించేందుకు కంకణం కట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మెక్సికోతో సరిహద్దు పొడవునా గోడ నిర్మించాలని తలపెట్టారు. కానీ దాని నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యయ ప్రయాస అని వాస్తవ పరిస్థితులు చెప్తున్నా ట్రంప్ మాత్రం మెక్సికో సరిహద్దు వెంబడి గోడ నిర్మాణానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తున్నది.

దీని నిర్మాణానికి 12 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఆయన అంచనా వేస్తే.. హోంలాండ్ సెక్యూరిటీ అండ్ గవర్నమెంటల్ అఫైర్స్‌పై డెమొక్రాట్ సెనెట్ కమిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం అది 70 బిలియన్ డాలర్లు అవుతుందని అంచనావేసింది. ఇది ట్రంప్ అంచనాలతో పోలిస్తే రమారమీ ఆరు రెట్లు ఎక్కువ సుమా.. ఒకవేళ ట్రంప్ నిర్ణయం అమలు చేయబూనుకుంటే సుమారు 2000 మైళ్ల పొడవునా గోడ, కంచె నిర్మించాల్సి ఉంటుంది.

ఈ గోడ నిర్మాణానికి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌ట్రా ఫండింగ్ రూపంలో మూడు బిలియన్లు విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్‌ను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కోరుతోంది. వచ్చే సెప్టెంబర్ నుంచి గోడ నిర్మాణ పనులు చేపట్టడంతోపాటు సరిహద్దుల్లో అక్రమ వలసలకు పాల్పడే వారిని అరెస్ట్ చేయడానికి, వారి స్వదేశానికి పంపేందుకు వీలుగా బోర్డర్ అండ్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎజెంట్లను నియమించుకోవాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది.

అమెరికా కాంగ్రెస్, సెనెట్ అంచనాలిలా

అమెరికా కాంగ్రెస్, సెనెట్ అంచనాలిలా

2018 బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ గోడ నిర్మాణం కోసం 2.6 బిలియన్ డాలర్లను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కేటాయించనున్నది. ఈ గోడ నిర్మాణానికి 2017, 2018 బడ్జెట్లలో గోడ నిర్మాణానికి 4.1 బిలియన్ల డాలర్ల నిధులు కేటాయించాలని అధ్యక్షుడు ట్రంప్ కోరనున్నారని మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ మిక్ ముల్వానేయ్ తెలిపారు. మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంచనాల ప్రకారం 12 బిలియన్ల డాలర్లు ఖర్చవుతుందన్న ప్రతిపాదన చాలా తక్కువది కాగా, గత జనవరిలో ప్రజాప్రతినిధుల సభ, సెనెట్ కమిటీ అంచనా ప్రకారం 15 బిలియన్ల డాలర్లు ఖర్చవుతుందన్న అంచనా చాలా ఆమోదయోగ్యంగా కనిపిస్తున్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కానీ హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌పై డెమొక్రాట్ల సెనెట్ కమిటీ అంచనా ప్రకారం 70 బిలియన్ల డాలర్లు ఖర్చవుతుందంటే అదీ ఏడాది హోంలాండ్ సెక్యూరిటీ విభాగం బడ్జెట్‌కు రెట్టింపు అవుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ధర్మ సందేహం ఏమిటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, డెమొక్రాట్ సెనెట్ కమిటీ అంచనాల్లో ఏది సరైందన్నది చెప్పడమూ కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.

25 ఏళ్లకు పైగా సమయం పట్టే చాన్స్

25 ఏళ్లకు పైగా సమయం పట్టే చాన్స్

వాస్తవంగా 2006లో సరిహద్దు భద్రత కోసం సుమారు 700 మైళ్ల పొడవునా గోడ నిర్మాణానికి ఆమోదించిన భద్రతా కంచె చట్టం ప్రకారం అమెరికా కాంగ్రెస్ 50 బిలియన్ల డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అంతేకాదు 25 ఏళ్లకు పైగా సమయం పడుతుందని కూడా తేల్చేసింది. ఇందులో కేవలం గోడ నిర్మాణానికి అవసరమైన సామాగ్రి, నిర్మాణంలో పాల్గొనే కార్మికుల వేతన ధరలు మాత్రమే లేవు. సరిహద్దు వెంబడి ప్రైవేట్ వ్యక్తుల భూస్వాధీనంపై న్యాయ పోరాటాలు, భూమి స్వాధీనానికి అవసరమయ్యే పరిహారం చెల్లింపులు తదితరాలు ఉన్నాయి. దక్షిణ టెక్సాస్ పరిధిలో 1000 మైళ్లకు పైగా రియో గ్రనెడే నది పొడవునా సరిహద్దు గోడ నిర్మాణానికి ఏండ్లు పూండ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. జాతీయ భద్రతా నిపుణుడు డేవిడ్ డానెల్లో స్పందిస్తూ సౌత్ టెక్సాస్ వద్దకు వచ్చే సరికి గోడ నిర్మాణం చాలా ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొన్నారు.

గోడ నిర్మాణంపై హోంలాండ్ సెక్యూరిటీ ఇలా

గోడ నిర్మాణంపై హోంలాండ్ సెక్యూరిటీ ఇలా

గోడ నిర్మాణం విషయమై నిధుల కేటాయింపు విషయమై అమెరికా కాంగ్రెస్ నిర్ణయం కోసం హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ వేచి చూసే ధోరణిలో కనిపించడం లేదు. ఇప్పటికే 30 అడుగులు ఎత్తున ప్రొటోటైప్స్ తరహాలో గోడ నిర్మాణ సామర్థ్యం గల కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. ఎటువంటి గోడ నిర్మాణం అవసరమన్న అంశంపై కూడా హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ ద్రుష్టి సారించింది. ఇప్పటికే బిలియన్ల డాలర్లను కేటాయించాలని అమెరికా కాంగ్రెస్ ను కోరిన డీహెచ్ఎస్.. దశల వారీగా, విడుతల వారీగా నిధుల కేటాయింపు జరుపాలని కోరు అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ గోడ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందన్న సంగతి ఎవరూ నిర్దిష్టంగా చెప్పడం లేదు. గోడ నిర్మాణం కోసం వైట్ హౌస్ నుంచి నిర్దిష్టమైన, సవివరమైన ప్రణాళిక లేనప్పుడు పార్టీలకతీతంగా కాంగ్రెస్ సభ్యులు మద్దతు తెలుపడం ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అవసరమైతే గోడ నిర్మాణానికి నిధుల విడుదలను అడ్డుకుంటామని డెమొక్రాట్లు చెప్తున్నారు. రిపబ్లికన్లు కూడా మద్దతునివ్వడం అనుమానమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిధుల కేటాయింపునకు మెక్సికో ససేమిరా

నిధుల కేటాయింపునకు మెక్సికో ససేమిరా

మరోవైపు గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపుపై మెక్సికో మొండిగానే వ్యవహరిస్తున్నది. దీనిపై తాము మెక్సికో విదేశాంగశాఖ మంత్రితో సంప్రదింపులు జరుపలేదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్ పేర్కొన్నారు. కేవలం అమెరికా నిధులతోనే గోడ నిర్మాణానికి పూనుకోవాలంటే కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. దీనిపై ఎంత ఖర్చవుతుందన్నదీ స్పష్టంగా ఉండాలని పేర్కొంటున్నారు. ఇప్పటికే డెమొక్రాట్లు.. రిపబ్లికన్లకు తేల్చి చెప్పారు. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం గోడ నిర్మాణానికి పూనుకుంటే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన ‘బోర్డర్ అడ్జస్ట్ మెంట్ టాక్స్' ఆలోచనను మెక్సికో, అమెరికా కాంగ్రెస్ తోసిపుచ్చాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
President Donald Trump wants to build a wall on the southern border of the US. It’s going to be expensive. That’s about specific as it gets with the White House’s proposal to build roughly 2,000 miles of walls and fences across the southern border.
Please Wait while comments are loading...