వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా: తమిళనాడులో ఇలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలు బిజెపికి విజయాన్ని కట్టబెట్టాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి కాంగ్రెసును ఊడ్చేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనాలు వేశాయి.

అదే విధంగా గుజరాత్‌లో బిజెపి తిరిగి అధికారన్ని నిలబెట్టుకుంటుందని దాదాపుగా అన్ని సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో తెలియజేశాయి. అయితే, అవి ఎంత వరకు నిజమవుతాయనే చర్చ ఎప్పటికప్పుడు సాగుతూనే ఉంటుంది. కాస్తా అంచనాలు వాస్తవ ఫలితాలు కాస్తా దగ్గరగా ఉండే సంస్థకు విశ్వసనీయత పెరుగుతుంది.

గతంలో తమిళనాడు, పంజాబ్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలను, వాస్తవ ఫలితాలను బేరీజు వేసి చూస్తే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఏ ఉండవచ్చుననే విషయంపై అంచనాకు వచ్చే అవకాశం లేకపోలేదు.

 తమిళనాడుఎగ్జిట్ పోల్ అంచనాలు...

తమిళనాడుఎగ్జిట్ పోల్ అంచనాలు...

తమిళనాడులో వివిధ సంస్థలు అన్నాడియంకె విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఫలితాలను సరిగా అంచనా వేయలేకపోయాయని వాస్తవ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. జయలలిత నాయకత్వంలోని అన్నాడియంకె భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఎలక్షన్ డాట్ ఇన్ అన్నాడియంకెకు 95, డిఎంకెకు 30 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సి వోటర్ అన్నాడియంకెకు 139, డిఎంకెకు 78 సీట్లు, ఇండియా టుడే - ఆక్సిస్ అన్నాడియంకెకు 99, డిఎంకెకు 132 సీట్లు వస్తాయని అంచనా వేసింది. న్యూస్ నేషన్ అన్నాడియంకెకు 97, డిఎంకెకు 116 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎబిపి అన్నాడియంకెకు 95, డిఎంకెకు 132 సీట్లు వస్తాయని చెప్పింది. చాణక్య అన్నాడియంకెకు 90 సీట్లు, డిఎంకెకు149 సీట్లు, ఎన్డీటివీ అన్నాడియంకెకు 103, డిఎంకెకు 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

 అన్నాడియంకె విజయం...

అన్నాడియంకె విజయం...

ఎగ్జిట్ పోల్ అంచనాలను తారుమారు చేస్తూ జయలలిత నాయకత్వంలోని అన్నాడియంకె ఘన విజం సాధించింది. అన్నాడియంకెక 134 సీట్లు రాగా, డిఎంకెకు 89 సీట్లు వచ్చాయి. కాంగ్రెసుకు 8 సీట్లు వచ్చాయి. అయితే, అన్నాడియంకె సీట్లు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఎక్కువగా అంచనా వేసుకోవడం వల్ల ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు అయి ఉంటాయని భావించవచ్చు. అయితే, కొన్నిసార్లు ఎన్నికల్లో పనిచేసే అంశాలను సరిగా గుర్తించకపోవడం వల్ల కూడా అది జరగవచ్చు.

పంజాబ్ ఎగ్జిట్ పోల్ అంచనాలు...

పంజాబ్ ఎగ్జిట్ పోల్ అంచనాలు...

పంజాబ్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు వాస్తవ ఫలితాలను ఏ మేరకు ప్రతిబింబించాయనేది కూడా చూడవచ్చు. శిరోమణి అకాలీదళ్, బిజెపికి కలిపి 4-7, కాంగ్రెసుకు 62-71, ఆప్‌నకు 42-51 సీట్లు వస్తాయని ఇండియా టుడే - ఆక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. శిరోమణి అకాలీదళ్ - బిజెపి కూటమికి 9, కాంగ్రెసుకు 54, ఆప్‌నకు 54 సీట్లు వస్తాయని టుడేస్ చాణక్య అంచనా వేసింది. బిజెపి కూటమికి 5-13, కాంగ్రెసుకు 41 - 49 ఆప్‌నకు 59 - 67 సీట్లు వస్తాయని ఇండియా టీవీ, సి వోటర్ సర్వే తెలిపింది. బిజపి కూటమికి 7, కాంగ్రెసుకు 48, ఆప్‌నకు 61 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే అంచనా వేసింది.

పంజాబ్ వాస్తవ ఫలితాలు...

పంజాబ్ వాస్తవ ఫలితాలు...

ఎగ్టిట్ పోల్ సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బలాన్ని ఎక్కువగా అంచనా వేశాయి. ఆ మేరకు కాంగ్రెసు బలాన్ని తక్కువగా చూపాయి. కాంగ్రెసుకు 77 సీట్లు రాగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 20, శిరోమణి అకాలీ దళ్‌కు 15, బిజెపికి 3 సీట్లు వచ్చాయి.

English summary
Exit poll surveys predicted BJP's victory in Gujarat and Himachal Pradesh elections. If the Tamil Nadu experience is seen, we can come conclusion how far the exit poll surveys reflect real results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X