క్రికెట్ మ్యాచ్‌ల్లో వచ్చే యాడ్స్ రేటేంతో తెలుసా... సెకనుకు ఇన్ని లక్షలా...?
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో క్రికెట్ అత్యంత ఆకర్షణీయమైన క్రీడలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగా ప్రసిద్ధి చెందింది. అందుకే, క్రికెట్‌కు పెట్టే ఖర్చు విషయంలో కార్పొరేట్ కంపెనీలు వెనుకాడడం లేదు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ గురించి అందరికి తెలిసిందే. దీనిని నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రపంచ కప్ నిర్వహించనున్నారు. ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ICC క్రికెట్ ప్రపంచ కప్ అక్టోబర్ 5,2023 నుంచి ప్రారంభమైంది.
గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి ప్రపంచకప్‌లో ప్రకటనల రేటు చాలా భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు సాధారణంగా మధ్యలో యాడ్‌లు వస్తుంటాయి. మధ్యలో ఎందుకు ఈ యాడ్‌లు అని మనం విసుక్కుంటాం. కానీ, ఆ యాడ్‌ల విలువెంతో తెలిస్తే షాకయిపోతారు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు 10 సెకన్ల స్లాట్ కోసం కంపెనీలు 30 లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అంటే ప్రతి సెకను ప్రకటన ఖరీదు దాదాపు 3 లక్షల రూపాయలన్నమాట. గత ప్రపంచకప్ కంటే ఇది 40 శాతం ఎక్కువేనని సమాచారం.

నవంబర్ 19 వరకు కొనసాగుతాయి : అయితే, ఈ సారి ప్రపంచ్‌కప్ అక్టోబర్ 5 న ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీకి ఈసారి మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. అది కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. 2019 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య తొలి పోరుతో 2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమమైన ఈ ఈవెంట్, నవంబర్ 19 వరకు కొనసాగుతుంది.
క్రికెట్ అనగానే సాధారణంగా టీవీలో చూస్తుంటాం. ప్రత్యక్షంగా డబ్బులు పెట్టి చూసేవాళ్లుంటారు. అంత స్థోమత లేని వాళ్లు టీవిలోనో, మొబైల్లోనూ చూస్తుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో కోట్లాది మంది ఈ పోటీలను చూడడం జరుగుతుంది. ఈ ఈవెంట్ కేవలం క్రికెటర్లు, వీక్షకులకే కాక పెద్ద పెద్ద కార్పొరేటర్లకు ఒక వేదికగా మారుతుంది. ఎందుకంటే కోట్లాది మంది క్రికెట్ అభిమానులను ఆకర్షించేందుకు ఈ పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఏవైనా చేస్తాయి. ఈ సమయంంలోనే వారి దగ్గరన్న డబ్బును నీళ్లలా ఖర్చు పెడతారు.
40 శాతం ఎక్కువ : జనాభా పరంగా ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్లలో భారతదేశం ఒకటి. ఈసారి ప్రపంచ కప్‌నకు ఇండియా ఆతిథ్యం ఇస్తోంది కాబట్టి, ప్రేక్షకుల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. దాదాపు ఒకటిన్నర నెలల వ్యవధిలో మొత్తం వీక్షకుల సంఖ్య వందల కోట్లకు చేరుతుంది. ఇందులో భాగంగానే అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి అనేక గ్లోబల్ కంపెనీలకు క్రికెట్ ప్రపంచ కప్ గొప్ప వేదిక అవ్వబోతుంది.

కొన్ని నివేదిక ప్రకారం.. గత ప్రపంచకప్‌తో (2019) పోలిస్తే ఈసారి ప్రపంచకప్‌లో ప్రకటనల రేటు చాలా భారీగా పెరిగిందని అంచనా. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు 10 సెకన్ల స్లాట్ కోసం కంపెనీలు 30 లక్షల రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అంటే ప్రతి సెకను ప్రకటన ఖరీదు దాదాపు 3 లక్షల రూపాయలు. గత ప్రపంచకప్ కంటే ఇది 40 శాతం ఎక్కువ.
పెద్ద పెద్ద బ్రాండ్లే : మొత్తంగా ఈ ఈవెంట్‌లో అన్ని బ్రాండ్స్ కలిపి ప్రకటనల కోసం 240 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నాయని తెలుస్తోంది. అంటే మన కరెన్సీ ప్రకారం అక్షరాలా 2,000 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రతిఏటా కంపెనీలు ప్రకటనలు & స్పాన్సర్‌షిప్ మొదలైనవాటి కోసం క్రికెట్ మీద సుమారు 1.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నాయి. ఇది, భారతదేశంలోని మొత్తం క్రీడా వ్యయంలో 85 శాతానికి సమానమాని తెలీంది.
ప్రపంచ కప్ క్రికెట్ సందర్భంగా ప్రకటనల కోసం ఖర్చు చేసే గ్లోబల్ బ్రాండ్స్‌లో కూల్‌డ్రింక్ కంపెనీ కోకా కోలా, ఆల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్ పే, యూనిలీవర్ Plcకి చెందిన భారతీయ యూనిట్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, సౌదీ అరేబీయాకు చెందిన ఆయిల్ గ్రూప్ ఆరామ్‌కో, దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్, కార్ల కంపెనీ నిస్సాన్ మోటార్, వంటి పెద్ద పెద్ద బ్రాండ్ల పేర్లే కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications