Longest national highways: దేశంలోనే అతి పొడవైన నేషనల్ హైవేలు ఏవో తెలుసా!!
భారతదేశంలోని రైల్వే నెట్వర్క్ ఏ విధంగా అయితే ఉందో జాతీయ రహదారుల నెట్వర్క్ కూడా అదే విధంగా విస్తరించబడుతుంది. జాతీయ రహదారుల నిర్మాణంతో దేశవ్యాప్తంగా చెప్పుకోదగిన పని జరుగుతుంది. భారతదేశంలో తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు దేశం మొత్తం హైవేల ద్వారా అనుసంధానం చేయబడుతుంది.
భారత దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా నేషనల్ హైవే నెట్వర్క్ కనిపిస్తుంది. 200 కంటే ఎక్కువ హైవేలు వివిధ రాష్ట్రాలను ఒకదానితో ఒకటి కలుపుతూ బేస్ రోడ్డు రవాణాను ఈజీ చేస్తున్నాయి. అయితే ఈ హైవే లలో ఏ హైవే పొడవైనది? దేశంలోనే అతిపెద్ద నేషనల్ హైవేలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

నేషనల్ హైవే 44. ఇది భారతదేశంలోని అతి పొడవైన జాతీయ రహదారి. ఇది దాదాపు 3,745 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నేషనల్ హైవే 44 జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ నుండి మొదలై తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. నేషనల్ హైవే 27.. ఇది భారతదేశంలోని రెండవ పొడవైన జాతీయ రహదారి. దీని పొడవు 3,507 కిలోమీటర్లు. ఈ జాతీయ రహదారి పోరుబందర్ మరియు సిల్చార్ లను కలుపుతుంది.
జాతీయ రహదారి 48. ఇది దేశంలోనే మూడవ పొడవైన జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి ఢిల్లీ నుంచి ప్రారంభమై చెన్నైలో ముగుస్తుంది. దీని పొడవు 2,807 కిలోమీటర్లు. నేషనల్ హైవే 52. దీని పొడవు 2,317 కిలోమీటర్లు. ఈ జాతీయ రహదారి పంజాబ్లోని సంగ్రూర్ నుండి ప్రారంభమై కర్ణాటక రాష్ట్రంలోని అంకోలాకు కలుపుతూ విస్తరించి ఉంది.
జాతీయ రహదారి 30. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సితార్ గంజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం వరకు విస్తరించి ఉంది. దీని పొడవు 1,984 కిలోమీటర్లు. ఇంకా కేంద్రం జాతీయ రహదారుల నిర్మాణంపై ఫోకస్ చేస్తుంది. దేశ వ్యాప్తంగా రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడితే రవాణా రంగం ప్రగతి పథంలో పయనిస్తుంది.












Click it and Unblock the Notifications